/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-87.jpg)
Actress Varalaxmi Sarath Kumar Wedding Reception Cermony : టాలీవుడ్ లో క్రాక్, వీరసింహారెడ్డి, యశోద వంటి సినిమాల్లో లేడీ విలన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarath Kumar) పెళ్లి గ్రాండ్ గా జరిగింది. బుధవారం ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్దేవ్ తో కలిసి ఏడడుగులు వేసింది.ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది బంధుమిత్రులు, స్నేహితులు హాజరయ్యారు. వివాహం అనంతరం చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
வரலஷ்மி சரத்குமார் - நிகோலாய் சச்தேவ் திருமண வரவேற்பில் கலந்துகொண்ட பிரபலங்கள்! 📸#VaralaxmiSarathkumar | #NicholaiSachdev | #Weddingpic.twitter.com/h8Ibv1gjqy
— சினிமா விகடன் (@CinemaVikatan) July 3, 2024
Also Read : క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి సరసన నిత్యామీనన్!
ఈ రిసెప్షన్‌కు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. బుధవారం రాత్రి చెన్నైలో జరిగిన ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(M.K Stalin), ఉదయనిధి స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం, అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ, బీజేపీ నేత అన్నామలై, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, ఆర్కే రోజా, ఆమె భర్త సెల్వమని, రమ్మకృష్ణ, సుహాసిని, మణిరత్నం, అట్లీ ఆయన భార్య ప్రియ, ప్రభుదేవ, విజయ్ ఆంటోని, ఐశ్వర్య రజినీకాంత్, తమన్, డైరెక్టర్ గోపీచంద్, సుదీప్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ తదితరులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Varalaxmi Sarathkumar - Wedding Reception Pic😍 #VaralaxmiSarathkumar#Varalaxmi#Varalaxmi#Nicholai#Marriage#VNWeddingpic.twitter.com/NOJXIE6j1E
— Cinema Times (@CinemaTimesOff) July 3, 2024
— சினிமா விகடன் (@CinemaVikatan) July 3, 2024