YS Sharmila: కడపలో అందుకే ఓడిపోయాను: షర్మిల

రాహుల్ గాంధీ కష్టం వల్ల కాంగ్రెస్ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ విపరీతంగా డబ్బులు పంచడం వల్లే తాను కడపలో గెలవలేదని పేర్కొన్నారు.

New Update
YS Sharmila: సీఎం జగన్ పై షర్మిల విమర్శల బాణం

రాహుల్ గాంధీ కష్టం వల్లే కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని.. రాబోయే రోజుల్లో ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. ప్రజా సమస్యల పట్ల రాహుల్ గాంధీ స్పందన బాగుండటం వల్లే దేశంలో జరిగిన ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఇచ్చారని అన్నారు.' రాహుల్ గాంధీ ప్రతి కార్యకర్త తల ఎత్తుకునేలా పార్టీ కోసం కృషి చేస్తున్నారు. బీజేపీ మతం పేరుతొ చిచ్చు పెడుతుంది. ఈ పార్టీ అరాచకాలు ఎక్కువయ్యాయి కాబట్టే మెజారిటీ తగ్గింది. కేంద్రంలో బీజేపీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో తెలియదు.

Also Read: ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు?

ఏపీలో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసారు. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ఊపిరి. మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసారు. ఆయన 10 ఏళ్ళు హోదా ఇస్తా అంటే చంద్రబాబు 15ఏళ్ళు కావాలి అన్నారు.ఇప్పుడు చంద్రబాబు వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మోదీ మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు హోదా తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్టు అనేది వైస్సార్ ఆలోచన. కుడి, ఎడమ కాలువ పనులు రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దాన్ని పూర్తి చేయలేక పోయారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ అంటూ కాలయాపన చేశారు. పోలవరం మీద చంద్రబాబు శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. 80శాతం పనులు పూర్తి అయితే ఇంకా నాలుగు ఏళ్ళ ఎందుకు పడుతుంది.

మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. వైసీపీ నేతలు విపరీతంగా డబ్బులు పంచారు. అందుకే నేను కడపలో గెలవలేదు. 14 రోజులు మాత్రమే నేను కడపలో తిరిగాను. చాలా మందికి నేను పోటీ చేసిన సంగతి కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల టికెట్‌ పారదర్శకంగా జరిగింది. కొందరి చిల్లర మాటలకు నేను పట్టించుకొను. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి వివేకా కేసులో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. బ్యాలెట్ ఓటింగ్‌పై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సి అవసరం ఉందని ' షర్మిల అన్నారు.

Also Read: జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?

Advertisment
తాజా కథనాలు