YS Sharmila: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్! ఏపీలో రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 09 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: ఏపీలో విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల వైఎస్ షర్మిలా (YS Sharmila) విమర్శలు గుప్పించారు. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ ప్రశ్నలు సంధించారు. పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు. సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా పరిస్థితి చూసే మాట్లాడుతున్నారా? రాత్రంతా క్యూలైన్లో రైతులను నిలబెట్టడమా మీ NDA ప్రభుత్వ కట్టుబడి? సంక్షోభం నుంచి సంక్షేమం అంటే కుండపోత వర్షంలో మహిళలను ఇబ్బందులు పాలు చేయడమే కాబోలు! రైతుల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేక కుటుంబాన్ని గుంజుతున్నారంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన వివరణ తలా తోక లేనిది. సాగర్ కుడికాలువ కింద రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా ? పల్నాడు జిల్లాలో కౌంటర్ల దగ్గర రైతుల పడుతున్న కష్టాలు మీకు కనిపించడం లేదా ? సంబంధిత శాఖ మంత్రిగా నేరుగా… https://t.co/WnNbwI1LAA pic.twitter.com/6fjYn29GAv — YS Sharmila (@realyssharmila) August 9, 2024 ఇది కూడా చదవండి: Illegal liquor: ఏపీలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం.. రూ. 36 లక్షలు నేలపాలు! ఈ మేరకు వైసీపీ ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్టకనే కదా మీకు పట్టం కట్టింది. జగన్ నిండా ముంచారు అనే కదా 11 సీట్లకు పరిమితం చేసింది. మోసం చేశారు అనే కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రైతులను వ్యతిరేకించే బీజేపీ తో మీరు కూటమి కట్టి, పక్షపాతిగా ఉంటామని హామీలు ఇచ్చి, గద్దెనెక్కి, ఇప్పుడు వాళ్లను వర్షంలో నిలబెట్టారు. ఇది మీ సర్కారుకి న్యాయమా? అంటూ మండిపడ్డారు. నాట్లు వేసిన 130 రోజుల్లోనే పంట చేతికి వస్తుందని జేజీఎల్ - 384 రకం విత్తనాలను కావాలని అడగడం రైతులు చేసిన పాపం అంటారా మంత్రిగారంటూ ఫైర్ అయ్యారు. రైతు అడిగింది ఇవ్వాలని హక్కుగా మేము ప్రశ్నిస్తే.. రెచ్చ గొట్టినట్లు ఎలా అవుతుందో వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. #ap-news #ys-sharmila #ap-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి