Ys Sharmila : ఏపీసీసీ(APCC) చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిలా రెడ్డి(Sharmila Reddy) మంచి దూకుడు మీద ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర ప్రధాన పార్టీ నేతలు అయినటువంటి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) మీద విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి షర్మిల జిల్లాల పర్యటన చేపడతున్నారు.
ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు..
ఈ పర్యటన ఇచ్చాపురం నుంచి ఇడుపుల పాయ వరకు సాగుతుదని తెలిపారు. ఈ నెల 23 న ముందుగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో(Vizianagaram District) షర్మిల పర్యటన కొనసాగుతుంది. జనవరి 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో షర్మిల పర్యటన ఉండగా..ఈనెల 25న కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆమె పర్యటన సాగుతోంది.
ఈ నెల 26న తూర్పు గోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటన సాగగా..ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు. ఈ నెల 28 న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పర్యటించి..జనవరి 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో పర్యటిస్తారు. 30 న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో పర్యటించగా, ఈ నెల 31న నంద్యాల, వైఎస్సాఆర్ కడప జిల్లాల్లో పర్యటన కొనసాగుతోంది.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ పార్టీ(Congress Party) నేతలతో చర్చించారు.రాబోయే ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని షర్మిల తెలిపారు .
గత పదేళ్లుగా అధికారంలో ఉండి వైసీపీ, టీడీపీ పార్టీలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేశారని షర్మిల మండిపడ్డారు . రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనకు ముఖ్యం అని అన్నారు. తాను ఎవరు వదిలిన బాణం కాదు అని స్పష్టం చేశారు.
Also read: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ వీవీఐపీలకు ఇచ్చే ” మహా ప్రసాద్ ” కిట్లలో ఏమేం ఉన్నాయో తెలుసా!