AP CM YS Jagan Key Meeting : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న వేళ అధికార పార్టీ దూకుడు పెంచింది. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని సభలు, సమావేశాలతో దూసుకుపోతున్నారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా ఆపరేషన్ పిఠాపురం (Pithapuram) మొదలు పెట్టింది వైసీపీ హైకమాండ్. ఈ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురం ముఖ్యనేతలు సీఎం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాడేపల్లి సీఎంఓ కార్యాలయం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు పిలుపువచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ తో సాయంత్రం భేటీ అయ్యేందుకు ఎమ్మెల్యే పెండెం దొరబాబు తాడేపల్లికి బయలుదేరినట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వైసీపీ చకచక పావులు కదుపుతోంది.
దీనిలో భాగంగానే బుధవారం సీఎం జగన్ ను ముద్రగడ పద్మనాభం, పిఠాపురం ఇంచార్జీ వంగా గీతా విశ్వనాథ్ (Vanga Geetha) సీఎం జగన్ తో భేటీ అయి పిఠాపురం రాజకీయాలపై చర్చించారు. కాగా ఈరోజు ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు సీఎంఓ నుంచి పిలుపు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం నియోజకవర్గంలోని పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో..నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు సీఎం జగన్ తో భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారుతోంది. పవన్ ఓటమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతుండటంతో పిఠాపురం రాజకీయాలు రోజురోజు ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పవచ్చు.