Jagan : పద్మవ్యూహంలో బలవ్వడానికి అభిమాన్యుడిని కాదు..అర్జునుడిని! ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోమవారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తన సమర సన్నద్దతను చాటి చెప్పారు. ఎన్నికల సమరంలో తనని తాను అర్జునుడిగా చెప్పుకున్నారు. మహా సంగ్రామంలో పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదని అర్జునుడని పేర్కొన్నారు. By Bhavana 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Chandrababu : ఏపీ(AP) ముఖ్యమంత్రి జగన్(CM Jagan) సోమవారం జరగనున్న ఎన్నికల(Elections) నేపథ్యంలో తన సమర సన్నద్దతను చాటి చెప్పారు. ఎన్నికల సమరంలో తనని తాను అర్జునుడిగా చెప్పుకున్నారు. ఎన్నికల మహా సంగ్రామంలో పచ్చ మీడియా పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదని అర్జునుడని పేర్కొన్నారు. ఈ అర్జునుడికి కృష్ణుడి వంటి నా ప్రజలు తోడుగా ఉన్నారని... ఈ యుద్ధంలో విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు. "వారి వ్యూహాల్లో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాల్లో, మోసపూరిత వాగ్దానాల్లో... వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. కానీ, ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి ప్రజల అండ, దేవుడి దయ తోడుగా ఉన్నాయి. అందుకే మీ బిడ్డ ఇలాంటి పద్మవ్యూహాలకు భయపడడు. మీ అండదండలు ఉన్నంతకాలం మీ బిడ్డ తొణకడు" అంటూ ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ముఖ్యమంత్రి జగన్ పంచుకున్నారు. Also read: కోళ్లు పెంచే రైతులకు శుభవార్త చెప్పిన పురంధేశ్వరి! #ycp #tdp #politics #ap-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి