/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/sharmila-11-jpg.webp)
YS Bharathi Reddy Into Election Campaign: ఏపీలో ఎన్నికల సందర్భంగా పులివెందుల రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ కు (CM Jagan) మద్దతుగా ఆయన సతిమణి వైఎస్ భారతి రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. 21 రోజులు పాటు పులివెందులలోనే భారతి ప్రచారం చేయనున్నారు. ఇవాళ్టి నుంచే ఇంటింటి ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రచారం కోసం సీఎం జగన్‌తో పాటు భారతి బయలుదేరారు.
Also Read: ‘వివేకం’ చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!
అటు భారతి.. ఇటు షర్మిల
మరోవైపు ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నవైఎస్ షర్మిల (YS Sharmila) సైతం ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుండి కడప ఎంపీ బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అటు భారతి, ఇటు షర్మిల ప్రచారంతో పులివెందుల ఎన్నికల రాజకీయం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే వైఎస్ షర్మిల సీఎం జగన్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. నేడు తన తల్లి వైఎస్ విజయమ్మ తోపాటు వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళుర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మ కొడుకు జగన్ ను హత్తుకుని భావోద్వేగం చెందారు. దీంతో విజయమ్మ మద్దతూ జగన్ కేనంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.