ప్రముఖ సినీ నటి శ్రీదేవి 2018లో దుబాయ్‌లో మరణించడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మరణంపై ఫేక్ పత్రాలు సృష్టించిన భువనేశ్వర్‌కు చెందిన దీప్తీ.ఆర్. పిన్నిటిపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు ఆదివారం సీబీఐ తెలిపింది. శ్రీదేవీ మృతిపై అనుమానాలను వ్యక్తపరుస్తూ.. దీప్తి సోషల్ మీడియాలో ఆమె అనేక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో వివాదస్పద ఆరోపణలు చేశారు.
Also Read: ఐదు రోజులుగా తిండి లేక.. పిల్లిని పీక్కుతిన్న యువకుడు
శ్రీదేవి మృతిపై తాను సొంతంగా దర్యాప్తు జరిపానని.. అందులో యూఏఈ(UAE) , భారత్ ప్రభుత్వాలు నిజాలు దాచాయని చెప్పారు. తన వాదనలకు సమర్థనగా ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతో పాటు.. సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్లు చూపించారు. అయితే ఆమె చూపించినవన్నీ కూడా నకిలీ పత్రాలంటూ మంబయికి చెందిన న్యాయవాది చాందినీ షా.. సీబీఐని ఆశ్రయించారు.
అంతేకాదు ఫిర్యాదులో దీప్తి,న్యాయవాది భరత్ సురేశ్‌ను కూడా చేర్చారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. దీప్తి ఆ యూట్యూబ్ ఛానల్‌లో చూపించిన పత్రాలు నకిలీవని గుర్తించింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై స్పందించిన దీప్తి..నా వాంగ్మూలం నమోదు చేయకుండా సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని అన్నారు.
Also Read: సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ