Crime News: సొంత ఇంటికే కన్నం వేసిన యువతి.. నగలు, నగదు చోరీ ఢిల్లీలోని ఓ యువతి ఏకంగా తన తల్లి ఇంటికే కన్నం వేయడం కలకలం రేపింది. చెల్లి పెళ్లి కోసం దాచిన లక్షల రూపాయల విలువైన నగలు, నగదును కాజేసింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటెజ్లతో ఇంట్లోకి వెళ్లిన కూతురును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 04 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి ఏకంగా తన తల్లి ఇంటికే కన్నం వేసింది. చెల్లి పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బులు, నగలను స్వాధీనం చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 30న ఉత్తమ్ నగర్‌కు చెందిన కమలేష్ అనే మహిళ పోలీస్ స్టేషకు వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం సమయంలో తాను ఇంట్లో లేనప్పుడు బీరువాలో దాచి ఉంచిన లక్షలాది రూపాయల విలువైన నగలు, రూ.25 వేల నగదు చోరీ అయ్యాయని ఫిర్యాదు చేసింది. పెద్ద కూతురే దొంగ దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కమలేష్ ఇంటిని పరిశీలించారు. అయితే ఆ ఇంటి మెయిన్ డోర్, బీరువా చెక్కు చెదరకుండా ఉండటంతో ఆ ఇంట్లోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లలేదని భావించారు. చివరికి ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీని ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే ఓ మహిళ బురఖా ధరించి ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు కనిపించింది. ఆమె ఎవరో కాదు కమలేష్ పెద్ద కూతురు శ్వేత(31)గా పోలీసులు గుర్తించారు. Also read: అసెంబ్లీకి రా చూసుకుందాం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ కౌంటర్ ఇంటి తాళాలు నొక్కేసింది శ్వేతను అదుపులోకి విచారించారు. కొంతకాలంగా తల్లి దగ్గరే ఉంటున్న శ్వేత అప్పులపాలైంది. జనవరిలో ఆమె తన తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చింది. వాటి నుంచి బయటపడేందుకు చెల్లి పెళ్లి కోసం దాచిన నగలను దొంగిలించాలని అనుకుంది. ఇందుకోసం ప్లాన్ వేసింది. జనవరి 30న శ్వేత తన తల్లి ఇంటికి వచ్చింది. సమయం చూసి తల్లి వద్ద ఉన్న ఇంటి తాళాలు దొంగిలించింది. కూరగాయాలు తీసుకొస్తా అనే సాకుతో బయటకు వెళ్లింది. కానీ పబ్లిక్ టాయిలెట్లోకి వెళ్లి బురఖా వేసుకుంది. ఆ తర్వాత తల్లి ఇంటికి వెళ్లింది. తన దగ్గర ఉన్న తాళంతో డోర్, లోపల్ ఉన్న బీరువా తెరచి.. లక్షల విలువైన నగలు, రూ.25 వేలు కాజేసింది. చివరికి పోలీసులు ఆమెను గుర్తించడం వల్ల ఈ వ్యవహారం బయటపడింది. అయితే నగలు అమ్మేసినట్లు శ్వేత చెప్పగా.. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. Also read: యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ కేబినెట్ ఆమోదం..! #delhi-news #thief #robbery #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి