Youtube Humming Feature: ఏదో పాట గుర్తుకు వస్తోంది. కానీ నోటికి రావడం లేదు. ట్యూన్ తెలుస్తోంది కానీ లిరిక్ తెలియడం లేదు. ఎలా వెతకాలో అర్ధం కావడం లేదు. ఇంతకు ముందు వరకూ ఇది మనలో చాలా మందికి ఎదురైన పెద్ద సమస్య. అయితే ఇక మీదట కాదు. ఇప్పుడు ఏ పాటనైనా ఇట్టే తెలుసుకోవచ్చును. జస్ట్ మనకు హమ్ చేయడం వస్తే చాలు. అదెలా అనుకుంటున్నారా...అంతా యూట్యూబ్ (Youtube) మహిమ. ఇప్పుడు యూట్యూడ్ ఓ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. పాటను హమ్ చేస్తే చాలు మనకోసం ప్లే చేసేస్తుంది. దీంతో పాటూ దాదాపుగా 30 కొత్త ఫీచర్లనూ యాడ్ చేసింది. అలాగే తన లుక్‌ను సైతం మార్చేసుకుంది యూట్యూబ్. ఈ కొత్త ఫీచర్లు అన్నీ యూట్యూబ్ యాప్, టీవీ, వెబ్ అన్ని వెర్షన్లలోనూ పనిచేస్తాయి.
Also Read: పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
హమ్ చేస్తే పాటను గుర్తించేలా యూట్యూబ్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మ్యూజిక్‌కి హమ్ చేసినా.. ట్యూన్‌ని విజిల్ ద్వారా వేసినా.. టీవీలో ప్లే అవుతున్న పాటను యూట్యూబ్‌లో ప్లే చేయాలన్నా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఎలా వాడాలంటే..?
యూట్యూబ్ యాప్‌లోకి వెళ్లి సెర్చ్ బార్ పక్కనున్న మైక్రోఫోన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దాని కన్నా ముందు మైక్రోఫోన్ యాక్సెస్ కోసం పర్మిషన్ ఇవ్వాలి. మైక్ సింబల్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే రెండు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. అందులో సాంగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.తర్వాత మనకు కావాల్సిన పాటను (Song) మూడు సెకన్లపాటు హమ్ చేస్తే సెర్చ్ రిజల్ట్‌లో వచ్చేస్తుంది.
ఒరిజనల్ పాటతో పాటు, యూజర్లు క్రియేట్ చేసిన కంటెంట్, సదరు పాటతో ఉన్న షార్ట్స్ కూడా దర్శనమిస్తాయి. కేవలం యూట్యూబ్ మొబైల్ యాప్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో అన్నింటిలోనూ ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది యూట్యూబ్ యాజమాన్యం.
ఇక దీంతో పాటూ యూట్యూబ్ కొత్తగా లాక్ స్క్రీన్ (Lock Screen) ను కూడా తీసుకువచ్చింది. ప్రస్తుతానికి మెబైల్, ట్యాబ్‌లలో అందుబాటులోకి వచ్చిన ఈ లాక్ స్క్రీన్ ద్వారా అనుకోకుండా యూట్యూబ్ స్క్రీన్ ను ట్యాప్ చేయకుండా అడ్డుకోవచ్చు. అలాగే యాప్ లో కొత్తగా స్టేబుల్ వాల్యూమ్ (Stable Volume) ఫీచర్ ను తీసుకువచ్చారు. దీని వల్ల కంటెంట్ తో పాటు సౌండ్ లో మార్పులు ఉండవు. కంటెంట్ ఏదైనా ఒకే స్థాయిలో సౌండ్ ఔట్ పుట్ ఉంటుంది. అందువల్ల, కంటెంట్ మారగానే ఒక్కసారిగా సౌండ్ పెరగడం, తగ్గడం వంటివి జరగవు. వీటితో పాటూ ఫర్ యూ ట్యాబ్ లాంటి మరెన్నోఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.