Health Benefits : పుష్ప సినిమా రేంజ్‌లో కాలు మీద కాలు వేసుకుంటే ఇక అంతే కాలుమీద కాలు వేసుకోని కూర్చుంటే ఆరోగ్య సమస్యలతోపాటు కొన్ని లాభాలూ ఉన్నాయి. క్రాస్ లెగ్స్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఒక కాలు పొడువు ఉన్నవాళ్లు ఇలా కూర్చుంటే పొత్తికడుపులో అమరికలు మెరుగుపడ్డాయని ఓ అధ్యయనంలో తేలింది. By Vijaya Nimma 08 Dec 2023 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Your Feet Can Tell About Your Health : పుష్ప(Pushpa) సినిమా..ప్యాన్ ఇండియాను ఓ ఊపు ఊపింది. కేవలం సినిమానే కాకుండా ఇందులోని పాటలు సన్నివేశాలు, డైలాగ్‌లు సైతం అందరినీ మెప్పించాయి. ఇందులో హీరో అల్లు అర్జున్ చెప్పే ఓ డైలాగ్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ కాలు నాదే..ఆ కాలు నాదే.. నా కాలుపై నేను కాలు వేసుకుంటే తప్పేంటి అంటూ హీరో చెప్పిన డైలాగ్‌కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. అయితే సినిమాలోలా బయట మనం కూడా కాలిపై కాలు వేసుకుని దర్జాగా కూర్చుంటే అంతేసంగతులు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు కొన్ని లాభాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇది కూడా చదవండి: ఈ చిన్న చిట్కాలతో మీ మెదడును శక్తివంతంగా మార్చుకోండి సాధారణంగా మనుషులు మూడు విధాలుగా కూర్చుంటారని, 62శాతం మంది కాళ్లను కుడివైపు పెట్టి కూర్చుంటే..26శాతం జనాలు ఎడమవైపునకు, ఇంకా 12శాతం ఎటువీలుగా ఉంటే అటు కూర్చుంటారని అధ్యయనాల్లో తేలింది. అయితే కాలు మీద కాలు వేసి కూర్చుంటే హిప్స్ అమరికలో తేడాలు ఉంటాయని, అప్పుడు ఒకటి పెద్దగా ఉంటుంది. అంతేకాకుండా మోకాలు, హిప్, పాదాల కింద భాగాలకు రక్తసరఫరా ఆగిపోతుందని అంటున్నారు. చీల మండలం దగ్గర మడిచి కూర్చునేకంటే మోకాలిపై మోకాలు వేసుకుని కూర్చుంటే మరీ ప్రమాదం అని నిపుణులు అంటున్నారు. ఇలా చేస్తే సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు. పొత్తికడుపులో అమరికలు పోతాయి.. ఎక్కువకాలం ఇలా కూర్చుంటే కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ తీరులో దీర్ఘకాలిక మార్పులు కూడా వస్తాయని చెబుతున్నారు. శరీరం ముందుకు వంగిపోవడం జరుగుతుందని, మెడ ఎముకల్లోనూ మార్పులు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పొత్తి కడుపు కూడా తన సర్దుబాటు లక్షణాలు కోల్పోతుందని, గూని వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అంతేకాకుండా వీర్య కణాల ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. మహిళలకు అయితే ఈ ప్రమాదం ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే క్రాస్ లెగ్స్ వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఒక కాలు పొడువు ఉన్నవాళ్లు ఇలా కూర్చుంటే పొత్తికడుపులో అమరికలు మెరుగుపడ్డాయని ఓ అధ్యయనంలో తేలింది. కాలిపై కాలు వేసుకుని కూర్చుంటే కండరాల పనిభారం తగ్గుతుందని అంటున్నారు. కానీ సాధ్యమైనంత వరకు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవద్దని సూచిస్తున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #tollywood #health-benefits #pushpa-2 #foot-on-foot మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి