Health Tips : మీరు చికెన్ తినాలో?మటన్ తినాలో? మీ బ్లడ్ గ్రూప్ చెబుతుందట..!! ప్రస్తుత కాలంలో మామూలు వెజ్ ఫుడ్ తింటేనే జీర్ణం కాని పరిస్థితి. అలాంటిది చికెన్, మటన్ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని బ్లడ్ గ్రూపుల వారు చికెన్ , మటన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. ఏ గ్రూపులో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. By Bhoomi 03 Feb 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips : కొందరికి ముక్కలేనిదే బుక్క దిగదు. చికెన్ అంటే ఇష్టంగా తినేవాళ్లు చాలా మందే ఉంటారు. చికెన్ లో వెరైటీలు కోరుకుని మరీ లాంగించేస్తుంటారు. కానీ చికెన్ తరుచుగా తినడం కూడా ప్రమాదకరమే. అయితే చికెన్ కానీ, మటన్ కానీ మీరు ఏం తినాలో నిర్ణయించేది మీ బ్లడ్ గ్రూప్ అని మీకు తెలుసా. మీకు ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. కానీ మేము చెప్పేది నిజం. ప్రతిఒక్కరూ వారి బ్లడ్ గ్రూప్ ను బట్టి ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోవచ్చు. ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏ ఫుడ్ తినాలో తెలుసుకుందాం. పూర్వం ఎలాంటి ఆహారం తిన్నా అరిగేది. రాళ్లు తిన్నా అరిగే శక్తి ఉండేదట. కానీ అలాంటి భారతీయుల వంటకాలను చైనీస్ ఫుడ్ నాశనం చేసింది. ఆరోగ్యాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో మామూలు వెజ్ ఫుడ్ తింటేనే జీర్ణం కాని పరిస్థితి. అలాంటిది చికెన్, మటన్ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని బ్లడ్ గ్రూపుల వారు చికెన్ , మటన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. మానవశరీరంలో మొత్తం నాలుగు రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి.ఇందలో ఓ, ఏ, బి, అలాగే ఏబీ ఈ నాలుగు ఉంటాయి. వారి జీర్ణశక్తి ఒక్కొక్కరిది ఒక్కోవిధంగా ఉంటుంది. ఇందులో ఏ బ్లడ్ గ్రూపు వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం. చికెన్, మటన్ అందరికీ జీర్ణం కాదు. నిపుణులు అభిప్రాయం ప్రకారం కొన్ని బ్లడ్ గ్రూపుల విషయంలో చికెన్ తరచుగా తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి. లేదంటే శారీరక సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఏ బ్లడ్ గ్రూపు: ఈ బ్లడ్ గ్రూపు ఉన్నవారు చాలా సున్నితంగా ఉంటారట. వీరికి ఇమ్యూనిటీ కూడా తక్కువే ఉంటుంది. జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు తీసుకునే ఆహారంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఇలాంటివారు శాఖాహారం తినడమే మంచిది. చికెన్ లేదా మటన్ తక్కువగా తినాలి. మాంసాహారం జీర్ణం చేసుకోవడం వీరికి కష్టంగా ఉంటుంది. చేపలు, పప్పులు సులభంగా జీర్ణం అవుతాయి. బి బ్లడ్ గ్రూప్: ఈ గ్రూపు వారు కాస్త శక్తివంతంగా ఉంటారు. వీరికి ఇమ్యూనిటీ కూడా ఎక్కువే ఉంటుంది. చికెన్, మటన్ ఎలాంటి ఫుడ్ అయినా సరే ఈజీగా జీర్ణం అవుతుందట. కాబట్టి వీరు ఆహారంలో వెజ్ తోపాటు నాన్ వెజ్ కూడా తీసుకోవడం మంచిదట. అయితే ఆహారంలో ఆకుపచ్చకూరగాయలతోపాటు పండ్లు, చేపలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఏబి , ఓ బ్లడ్ గ్రూప్స్: ఈ బ్లడ్ గ్రూపులు ఉన్నవారు ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తీసుకోవడం మంచిది. ప్రత్యేక ఆంక్షలు ఏమీ ఉండవు. అయినా కూడా చికెన్, మటన్ తినడంలో కొంత సమయమనం పాటించాలి. ఆకుకూరలు, సీఫుడ్స్ తినవచ్చు. అయితే కొందరికి మాత్రం జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వారు ఏదైనా ఫుడ్ తింటనే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. జీర్ణమయ్యేందుకు సమయం తీసుకుంటుంది. అలాంటివారు వైద్యులను సంప్రదించాలి. ఇది కూడా చదవండి: పరీక్షల కాలం..ఈ టిప్స్ తో ఒత్తిడికి టాటా చెప్పేయండి..!! #health-tips #food #blood-group #lifstyle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి