Visakha : విశాఖలో యువకుడు హల్చల్.. భార్యను అప్పచెప్పాలని డిమాండ్

విశాఖలో ఆర్కే బీచ్ దగ్గర అర్థరాత్రి ఓ యువకుడు హల్‌ఛల్ చేశాడు. యోగ విలేజ్ దగ్గర హోర్డింగ్ ఎక్కి గోలగోల చేశాడు. అతన్ని అక్కడ నుంచి దింపడానికి పోలీసులు నానాపాట్లు పడ్డారు.

New Update
Visakha : విశాఖలో యువకుడు హల్చల్.. భార్యను అప్పచెప్పాలని డిమాండ్

Young Man Halchal : తన ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకున్న భార్య ను అప్పజెప్పాలని విశాఖ (Visakhapatnam) లో ఓ యువకుడు అర్ధరాత్రి హడావుడి చేశాడు. ఆర్కే బీచ్ (RK Beach)  దగ్గర హోర్డింగ్ ఎక్కి దూకేస్తానంటూ బెదిరించాడు. కంచరపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని యువకుడు చంద్రశేఖర్ చెప్పాడు. తనకు కీర్తి అనే యువతితో మార్చిలో తిరుపతిలో పెళ్ళి అయిందని.. కానీ కొన్నాళ్ళు తరువాత ఆమె తల్లిదండ్రులు వచ్చి తనను తీసుకెళ్ళిపోయారని అంటున్నాడు. తన భార్య తల్లిదండ్రులు తనను నమ్మించి తీసుకెళ్ళారు. కానీ ఇప్పటి వరకు పంపించలేదని చెప్పాడు.

నాభార్య నాకు కావాలి..
తన భార్య ను అప్పజెప్పే వరకు హోర్డింగ్ నుండి కిందకు దిగనని మొడికేసుకుని కూర్చున్నాడు. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు చాలాసేపు చంద్రశేఖర్‌కు నచ్చజెప్పారు. అతని భార్యతో మాట్లాడి తన దగ్గరకు పంపిస్తానని చెప్పారు. దీంతో యువకుడు కిందికి దిగి వచ్చాడు.

Also Read:T20 World Cup: మొదటి మ్యాచ్‌లోనే పాక్‌కు షాక్..అమెరికా సంచలన విజయం

Advertisment
తాజా కథనాలు