Rice: అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా అన్నం తినాలి. అయితే ఈ రోజుల్లో చాలా మంది అన్నం తింటే బరువు పెరుగుతారని చాలా తక్కువగా తింటూ ఉంటారు. కొందరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అన్నం తినకూడదని చెబుతుంటారు. కానీ.. ఆయుర్వేదంలో థైరాయిడ్, పీసీఓడి, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా అన్నం తినొచ్చని అంటున్నారు. అయితే.. అన్నం వండే బియ్యంలో కూడా ఎన్నో రకాల బియ్యం మార్కెట్‌లో ఉన్నాయి. ఒక్కో రకం బియ్యంలో వేరే వేరే పోషక విలువలు ఉన్నాయి. అలాగే ఒక్కో రకం బియ్యం ఒక్కో రుచిని కలిగి ఉంటున్నాయి.
మంచి ఆరోగ్యం
ఇదిలో ముఖ్య విషయం ఏమిటంటే.. అన్నం వండే విధానాన్ని బట్టి పోషకాలు, మంచి ఆరోగ్యం లభిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్స్ వలన శరీరానిక శక్తిని ఇస్తాయి. బియ్యంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, బి విటమిన్ అనేక పోషకాలను శరీరానికి ఇస్తుంది. మనకి మంచి ఆరోగ్యం కావాలంటే ఎలాంటి బియ్యంతో అన్నం వండాలి..? ఏ విధంగా వండాలో..? ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.
బరువు పెరగరు..
ముందుగా అన్నం వండే సమయంలో బియాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక కప్పు బియ్యంలో నాలుగు కప్పుల నీళ్లు పోయాలి. దానిలో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఉడికించుకోవాలి. దానిలో ఎక్కువగా నీళ్లు ఉంటే వంపాలి. వంపిన నీళ్లని సూప్ లాగా కూడా తాగొచ్చు. ఇలా వండిన అన్నం తింటే ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు అన్నం పొడిపొడిగా ఉంటూ మంచి రుచి కూడా ఉంటుంది. ఇలా వండిన అన్నం తింటే బరువు కూడా పెరగరు. అయితే.. అన్నాన్ని తక్కువగా తిన్నప్పుడే ఈ లాభాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి
ఇది కూడా చదవండి: గురక సమస్యతో బాధపడుతున్నారా? ఈ హోం రెమెడీస్ ఫాలో అవ్వండి!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.