Ear Pain : అర్థరాత్రి చెవి నొప్పి వచ్చిందా.. ఇలా చేయండి

రాత్రిపూట అకస్మాత్తుగా చెవి నొప్పి వస్తే ఒక చెంచా ఉల్లిపాయ రసం, వెల్లుల్లి, ఉప్పు, తులసి ఆకుల రసం, పుదీనా ఆవ నూనె చెవిలో వేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇయర్‌ఫోన్లకు, ఇయర్ బడ్స్ లకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు అంటున్నారు.

New Update
Ear Pain : అర్థరాత్రి చెవి నొప్పి వచ్చిందా.. ఇలా చేయండి

Ear Ache At Midnight : మనం నిద్రపోతున్నప్పుడు(Sleeping) చాలాసార్లు రాత్రిపూట అకస్మాత్తుగా చెవులు నొప్పులు(Ear Pain) వస్తాయి. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. నిద్ర సరిగా ఉండక అల్లాడిపోతుంటాం. అలాంటప్పుడు ఈ చిన్న హోం రెమిడీస్‌(Home Remedies) ను పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఉల్లిపాయ:

  • రాత్రిపూట(Night Time) అకస్మాత్తుగా చెవి నొప్పి వస్తే ఒక చెంచా ఉల్లిపాయ రసం తీసుకోండి. ఉల్లిపాయ రసాన్ని వేడి చేసి రెండు, మూడు చుక్కలు చెవిలో వేయండి. ఇలా రోజుకి రెండు మూడుసార్లు చేస్తే చెవులు రిలీఫ్ అవ్వడమే కాకుండా నొప్పి కూడా తగ్గిపోతుంది.

వెల్లుల్లి:

  • వెల్లుల్లి చెవినొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. రెండు వెల్లుల్లి ముక్కలను తీసుకొని వాటిని చూర్ణం చేయండి. రెండు టీస్పూన్ల ఆవాల నూనెతో కలిపి వెల్లుల్లి ముక్కలను వేడి చేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత చెవిలో ఒకటి నుంచి రెండు చుక్కలు వేయండి. ఇలా చేస్తే చెవి నొప్పి తొందరగా తగ్గిపోతుంది.

ఆవ నూనె:

  • రాత్రిపూట అకస్మాత్తుగా చెవి నొప్పి వస్తే ఆవనూనెను చెవిలో వేయండి. చెవిలో రెండు నుంచి మూడు చుక్కల ఆవాల నూనె వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచండి. ఇలా చేస్తే ఉపశమనం కలుగుతుంది.

పుదీనా:

  • పుదీనా ఆకుల రసాన్ని తీసుకుని ఒకటి, రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే హాయిగా నిద్రపడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇయర్‌ఫోన్లకు దూరం:

  • చెవుల్లో ఎప్పుడూ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోవడం, ఇతరులు ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను వాడటం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.

ఇయర్ బడ్స్:

  • ఇయర్ బడ్స్(Ear Buds) వాడటం మానేస్తే మంచిది. ఇయర్ బడ్స్ చెవిలో ఇన్ ఫెక్షన్ని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్ సమస్యలను దూరం చేయాలంటే ఇయర్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే మంచిది.

ఉప్పుతో ఉపశమనం:

  • చెవి నొప్పిని త‌గ్గించ‌డంలో ఉప్పు మేలు చేస్తుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించాలి. ఓ కర్చీఫ్‌తో ఉప్పు మూట‌ కట్టి నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకుంటే మంచి ఫ‌లితం లభిస్తుంది.

తుల‌సి ఆకులు:

  • తుల‌సి ఆకుల‌ ర‌సాన్ని చెవిలో వేసుకున్న నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: మగవాళ్లకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌..లక్షణాలు ఇవే..!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 

Advertisment
తాజా కథనాలు