Weight Loss: ప్రశాంతంగా పడుకుని బరువు తగ్గొచ్చు తెలుసా?

బరువు తగ్గాలంటే రోజూ వ్యాయమం, మంచి డైట్‌ అవసరం లేదు. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చని సాల్క్ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులుంటున్నారు. రోజుకు 14 గంటలు మేల్కొనే వ్యక్తులు 11 గంటలు మాత్రమే నిద్రపోతే 16 వారాల తర్వాత..వీరి బరువు 4 శాతం తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.

Weight Loss: ప్రశాంతంగా పడుకుని బరువు తగ్గొచ్చు తెలుసా?
New Update

Weight Loss: ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చని మీకు తెలుసా..? ఈ విషయం ఎప్పుడైనా గమనించారా..? నేటి కాలంలో ఏది ఉన్నా లేకపోయినా.. సరైన నిద్ర అనేది ఖచ్చితంగా కావాలి. నిద్ర సరిగ్గా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధుల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా నిద్ర పోవడానికి కూడా సరైన సమయం ఉండటం లేదు. దానికి తోడు ఉన్న టైంలో ఫోన్, టీవీ, కంప్యూటర్‌ చూసుకుంటూ సగం లైఫ్ గడిపేస్తూ.. నిద్రను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. శరీరానికి సరైన నిద్ర లేకపోతే మానసికంగా, శారీరకంగా వచ్చే నష్టాలు ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మనలో చాలా మందికి ఉన్న అధిక బరువు పెద్ద సమస్యగా ఉంటుంది. కొందరైతే బరువు తగ్గటానికి రోజూ వ్యాయమం, మంచి డైట్‌ను ఫాలో అవుతారు. ఎక్కువ మంది కేలరీలు తక్కువగా తీసుకుంటే బరువు తగ్గుతామని అనుకుంటారు. అయితే.. ఇక నుంచి మీరు అంత కష్టపడకుండా.. ప్రశాంతంగా నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు. ఓ అధ్యయనం ప్రకారం రోజుకు 14 గంటలు మేల్కొనే వ్యక్తులను 11 గంటలు మాత్రమే నిద్రపోవాలని సాల్క్ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు సలహా ఇచ్చారు. 16 వారాల తర్వాత, వీరి బరువు చెక్ చేస్తే 4 శాతం తగ్గినట్లు వారు నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. ఇప్పుడు బరువు ఎలా తగ్గొచ్చు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్యాలరీలు బర్న్‌ అవుతాయి

  • మన నిద్రలోనూ శరీరం శక్తిని ఖర్చు చేస్తుంది.
  • కేలరీలను కూడా బర్న్‌ చేస్తుంది.
  • నిద్రలో, ఒక వ్యక్తి గంటకు 65 కేలరీలు బర్న్ చేస్తాడు.
  • 8 గంటల నిద్రలో 500కి పైగా కేలరీలు బర్న్‌ అవుతాయి.
  • ఎంత బాగా విశ్రాంతి తీసుకుంటే కొవ్వు అంత త్వరగా తగ్గుతుంది.
  • సమయాన్ని టీవీ చూస్తూ గడిపినట్లయితే..కేలరీలు బర్న్‌ అవుతాయి.

నిద్రపోకపోతే కలకలిగే నష్టాలు..

  • మంచి నిద్రలేకపోతే మగ, ఆడ ఇద్దరిలోనూ సంతానలేమి సమస్యలు వస్తాయి
  • విశ్రాంతి లేకపోతే హార్మోన్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతుంది.
  • నిద్ర లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వస్తాయి.
  • ఒత్తిడి, ఆందోళన స్థాయిలను పెంచుతుంది.
  • దీర్ఘకాలిక నిద్ర లేమి తరచుగా ఒత్తిడి ఆందోళన, వంధ్యత్వానికి కారణం అవచ్చు.
  • ధూమపానం, మద్యపానం, వ్యాయామానికి దూరంగా ఉండటం మంచిది.

మంచి నిద్రకు చిట్కాలు..

  • జీవనశైలి అలవాట్లల్లో మంచి వ్యాయామాలను ఎంచుకోవాలి.
  • రోజూకు కనీసం గంట నడవడం ఆరోగ్యానికి మంచిది
  • మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
  • నిద్రవేళకు ముందు ఆల్కహాల్, కెఫిన్ తినకుండా ఉంటే మంచిది
  • ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకుని మేల్కోవాలి.
  • పడకగదిని చీకటిగా, చల్లగా ఉంటే మంచి నిద్ర వస్తుంది.

ఇది కూడా చదవండి: భార్యాభర్తల బంధం దీర్ఘకాలం కొనసాగాలంటే ఇవి చేయకండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips #health-benefits #sleeping #weight-loss
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe