ఇప్పుడు చాలా మందిని పట్టిపీడిస్తోన్న సమస్య ఒత్తిడి. ఇది ఒంటరితనంతో మరింత పెరుగుతోంది. దానిని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటితో ఒత్తిడి నుంచి బయటపడి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే..ఈ ఒత్తిడిని ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒత్తిడి వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే.. వాటిని ఈ చిన్న పరిహారాల ద్వారా దూరం చేసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. ఇంకా ఎక్కువ ఒత్తిడి ఉంటే సరదాగా మిత్రులతో కలిసి టీ, కాఫీ, భోజనం కోసం బయటికి వెళ్తే కొంత ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. అప్పుడప్పుడు మంచి ప్రదేశాలు చూసినా.. ఎలాంటి ఒత్తిడి సమస్య నుంచి అయినా బయట పడవచ్చు అంటున్నారు.
ప్రకృతి అందాలను చూసినప్పుడు
ఇప్పుడున్న జనరేషన్ ఒంటరితనానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఉద్యోగాల రిత్యా అందరూ ఎక్కడెక్కడో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే.. వారు ఎవరితో ఎక్కువగా కలవకపోవడం, మాట్లాడకపోవటం, బయట ప్రపంచాన్ని చూడకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అందరూ ఇలాగే ఉంటే ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని సమయం దొరికినప్పుడల్లా అందరితో కలిసి సంతోషంగా ఉంటే కొంత ఒత్తిడి నుంచి దూరం అవ్వచ్చు. ఆటలాడటం, ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లడం, పెంపుడు జంతువులతో ఆడుకోవడం ఇలా కొన్ని రోజువారి పనుల్లో చేస్తూ ఉంటే ఒత్తిడి సమస్య నుంచి బయట పడవచ్చు. బయటకి వెళ్ళి ఆ పచ్చని ప్రకృతి అందాలను చూసినప్పుడు మన ఆలోచన విధానం మారిపోతుంది. అప్పుడు శరీరంలో తెలియని సంతోషం, ఉత్సాహం మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.
చిన్నచిన్న చిట్కాలు పాటించి ఒత్తిడి సమస్య దూరం
అనవసర టెన్షన్లు: చిన్నదానికి ఎక్కువ టెన్షన్ పడితే ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యాయి అవకాశాలు ఉన్నాయి. అందుకని చిన్న సమస్య వచ్చినా..? తెలిసినవారిని, స్నేహితులకు షేర్ చేసి దానిని పరిష్కారం అయ్యేలా చూసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు.. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.. ఆరోగ్యం బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఒత్తిడి సమస్య నుంచి బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
ఇది కూడా చదవండి: ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలుసా..?