Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్న మొత్తం కేసులెన్ని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నరసరావుపేటలో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఉన్న మొత్తం కేసులెన్ని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
New Update

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నరసరావుపేటలో ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత ఆయన్ని కోర్టుకు తరలించనున్నారు. ఈవీఎంను ధ్వంసం చేయడం, అడ్డుకున్నవారిపై దాడి చేయడం సహా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవలే ముందస్తు బెయిల్‌ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్లు వేయగా.. దీనిపై బుధవారం విచారించిన న్యాయస్థానం బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.

కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 1996లో యూత్‌ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004 నుంచి 2009 వరకు వెల్దుర్తి జెడ్పీటీసీగా పనిచేశారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాచెర్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై 9785 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి 2012లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చిరుమామిళ్ల మధుబాబుపై 16200 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

Also Read: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. నల్లమిల్లి సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల రోజున ఈవీఎం ధ్వంసం

2014,2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ పిన్నెల్లిని ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పిన్నెల్లి మాచర్ల నుంచి బరిలోకి దిగారు. అయితే మే 13న పోలింగ్ రోజున.. రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ 202 పోలింగ్ కేంద్రంలో చొరబడి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ వాదిస్తోంది.

పిన్నెల్లిపై మొత్తం ఎన్ని కేసులంటే 

అయితే పోలింగ్ రోజున మాచర్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అదే రోజున సాయంత్రం పోలీసులు పిన్నెల్లిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత అల్లర్లపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆయన మే 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కేసులు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్స్ పై దాడి, మహిళలను దూషించిన కేసు ఇలా మొత్తం ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయి.

Also Read: నెల్లూర్- చైనా.. వైసీపీ హయంలో భారీ కుంభకోణం!

బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు 

అయితే ఈ నాలుగు కేసుల్లో తనకు ముందుస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. జూన్ 4 వరకూ ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే నంబూరి శేషగిరిరావు దీనిపై సుప్రింకోర్టులో పిటిషన్ వేశారు. పిన్నెల్లిని అరెస్టు చేయకపోవటంపై సుప్రింకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు జూన్‌ 20న హైకోర్టులో వాదనలు ముగిశాయి. బుధవారం నాడు ఈ పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో తాజాగా పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.

#pinnelli-arrested #ap-politics #telugu-news #pinnelli-ramakrishna-reddy #ysrcp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి