Madanapalle : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కలకలం సృష్టించిన వైసీపీ (YCP) యువనాయకుడి హత్య (Murder) నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మదనపల్లె పట్టణం శ్రీవారి నగర్లో వైసీపీ నాయకుడు పుంగనూరు శేషాద్రి దారుణ హత్యకు గురైయ్యాడు. అర్థరాత్రి ఇంట్లో ప్రవేశించిన దుండగులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. భార్య ముందే భర్తను అతి దారుణంగా, కిరాతకంగా నరికి చంపేశారు.
శేషు హత్య కేసులో ఈనోవా వాహనంతో సహా మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ (Madanapalle Police Station) లో లొంగిపోయిన నలుగురు నిందితులు. శేషు (Sheshu) ని హత్య చేయడంలో బహుజన సంఘం నేత కీలక పాత్ర ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆనంద్ అనే వ్యక్తికి శేషుకి మధ్య పార్టీ పరంగా అధిపత్య విభేదాలున్నట్లు అధికారులు తెలిపారు.
ఆనంద్, శేషులు ఇరువురు వైసీపీ పార్టీల నాయకులుగా సమాచారం. అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్ల మధ్య వివాదం తలెత్తింది. భూ ఆక్రమణలు, కబ్జాలలో సైతం ఇరువురు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తన భర్త హత్య ఘటనలో పది మంది కి పైగా ఉన్నట్లు శేషు భార్య. మిగిలిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. శేషు హత్య పై వాస్తవాలను వెలికి తీసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.