Andhra Pradesh: ఈనెల 26న వైసీపీ మేనిఫెస్టో..నవరత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఆంధ్రాలోని వైసీపీ పార్టీ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేశారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కూడా రెడీ అయ్యారు. By Manogna alamuru 24 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి YCP Manifesto: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది వైసీపీ. బస్సు యాత్ర పేరుతో దాదాపు రాష్ట్రమంతా పర్యటించారు పార్టీ అధినేత జగన్. ప్రజలను దగ్గరగా కలుసుకుని వారితో అన్ని విషయాలను చర్చించారు. నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. అందరి దగ్గరా అన్ని వివరాలను సేకరించారు. ఈరోజుతో జగన్ సిద్ధం బస్సు యాత్ర కూడా ముగియనుంది. దీంతి తదుపరి ప్రణాళిను అమలు చేసేందుకు రెడీ అయిపోయారు. మరో రెండు రోజుల్లో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నవ రత్నాల అప్‌గ్రేడెడ్ వెర్షన్.. ఈనెల 26న అంటే మరో రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రేపు జగన్ కడపలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దాని తరువా ఎల్లుండి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలోలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న వాటిపై జగన్ మేనిఫెస్టోలో క్లారిటీ ఇవ్వనుననట్లు తెలుస్తోంది. ఆచరణ సాధ్యమయ్యే అంశాలతోనే మేనిఫెస్టో రూపొందించామని చెబుతున్నారు వైసీపీ నేతలు. మహిళలు, యువత, రైతులే టార్గెట్‌గా మేనిఫెస్టో ఉంటుందని దాంతో పాటూ పలు జనాకర్షణ పథకాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాలకు అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఉండొచ్చని తెలుస్తోంది. గత ఎన్నికల్లో నవ రత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. దాదాపు వాటన్నింటినీ చేశారు కూడా. అందుకే ఈసారి వాటి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌తో జగన్ ప్రజల ముందుకు వస్తారని అంటున్నారు. ఇందులో భాగంగా రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పాటూ మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు. Also Read:Politics: సంపద పునఃపంపిణీ మీద శామ్ పిట్రోడా ఆసక్తికర వ్యాఖ్యలు #andhra-pradesh #ycp #cm-jagan #manifesto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి