YCP vs TDP: నట సింహానికి చెక్ పెట్టేదెవరు? వైసీపీ వేసిన స్కెచ్ ఏంటి?

సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చెక్ పెట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద స్కెచ్ వేసిందా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? నందమూరి బాలకృష్ణను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ, గతంలో వైసిపి వర్గ విభేదాల వల్లనే వైసిపి ఓటమి పాలు అవుతూ వస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ పెద్దలు. 1983 టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపురం టిడిపికి కంచుకోటుగా ఉంది. నందమూరి తారక రామారావు రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా నందమూరి హరికృష్ణ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

MLA Balakrishna: బాలయ్య ఎక్కడ? ఏపీలో కనిపించకపోవడానికి కారణమదేనా?
New Update

YCP vs TDP at Hindupur in Andhra Pradesh: రాబోయే సాధారణ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో గెలిచేది ఎవరు.. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు చెక్ పెట్టడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద స్కెచ్ వేసిందా..? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం ఎంత మేరకు సక్సెస్ అవుతుంది? నందమూరి బాలకృష్ణను ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ, గతంలో వైసిపి వర్గ విభేదాల వల్లనే వైసిపి ఓటమి పాలు అవుతూ వస్తుందని ఆరోపిస్తున్న వైసీపీ పెద్దలు. 1983 టిడిపి ఆవిర్భావం నుంచి హిందూపురం టిడిపికి కంచుకోటుగా ఉంది. నందమూరి తారక రామారావు రెండుసార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా నందమూరి హరికృష్ణ సైతం ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

peddi reddy ramachandra reddy

బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారా:

2014, 19లో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాబోవు ఎన్నికల్లో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా.. బైపోల్ తో కలిపి తెలుగుదేశం పార్టీ పదిసార్లు పసుపు జెండా ఎగరవేసింది హిందూపురంలో, వైసీపీ పెద్దలు బాలకృష్ణను ఓడించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డిని సైతం ప్రచారంలోకి దింపుతామని చెప్పుకొచ్చిన మంత్రి రామచంద్రారెడ్డి. కుల సమీకరణలతో వర్గ విభేదాలను చక్కబెడుతూ ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలనే ఉద్దేశంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురం నియోజకవర్గం లో వైసీపీ ని గెలిపించడానికి భారమంతా తన భుజస్కందాల మీద వేసుకున్నారు.

నాలుగు వర్గాలుగా వైసీపీ:

గతంలో నియోజకవర్గంలో వైసిపి నాలుగు వర్గాలుగా ఉండేది ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, ఏపీ ఆగ్రోస్ చైర్మన్ నవీన్, చౌలూరు మధుమతి రెడ్డి, దీపిక వేణులు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురాన్ని వ్యక్తిగతంగా తీసుకొని బీసీ మహిళ అయిన దీపికాకు ఇంచార్జ్ పగ్గాలు అప్పజెప్పి నవీన్ మధుమతి రెడ్డి ఇక్బాల్ వర్గాలను సమన్వయం చేస్తూ వైసిపి పార్టీ గెలుపు కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వర్గ విభేదాలతో ఉన్న నాయకులను వారి కుటుంబ సభ్యులపై కేసులు బనాయింపజేసి ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇటీవల కాలంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ ఇక్బాల్ వర్గంలో ఉన్నందున తన భర్త శ్రీనివాసును పాత కేసుల విషయంలో అరెస్టు చేయించి ఆందోళనకు గురి చేయడం జరిగింది. అరెస్ట్ అయిన మరిసటి రోజే చైర్ పర్సన్ ఇంద్రజ దీపిక వర్గంతో చేతులు కలపడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

గెలిపించాలని కంకణం కట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి:

వర్గ విభేదాలతో ఉన్న నాయకులకు కార్యకర్తలకు మొదట సమన్వయంగా ఉండాలని ఆహ్వానం, సమన్వయంతో పనిచేయడానికి రాని వారిపై కేసులు బనాయించి సమన్వయ పరుస్తున్న వైసీపీ పెద్దలు. టిడిపికి కంచుకోటగా పేరు ఉన్న హిందూపురాన్ని గెలిపించి తీరాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంకణం కట్టుకున్నారు. ప్రతిరోజు హిందూపురం నాయకులతో కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు పోవాలని పిలుపునిస్తూనే ఉన్న మంత్రి ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని హుకుం జారీ చేస్తున్నారని ఇంటర్నల్ టాక్. ఈ మధ్య హిందూపురం వైయస్సార్సీపి నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చేశారు. ఆరోజు వర్గ విభేదాలతో ఉన్న నాయకులందరినీ ఒక వేదిక పైకి తీసుకువచ్చిన పెద్ధిరెడ్డి.

ఎలా అయినా ఆ రెండు సీట్లు గెలిచి తీరాలి:

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురాన్ని, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను ఎలాగైనా గెలిచి తీరాలని మంత్రి గంటా పరంగా సూచనలిచ్చారు. సీఎం జగన్ సైతం ఈ నియోజకవర్గంలో రెండు మూడుసార్లు ప్రచారం చేసే విధంగా నేను మాట్లాడతానని హామీ ఇచ్చిన మంత్రి పెద్ధిరెడ్డి రామచంద్ర రెడ్డి. మొదటి నుంచి హిందూపురం వైసిపి వర్గ విభేదాల వల్లనే టిడిపి గెలుస్తూ వస్తుందని చెబుతూ ఆ కంచకూటను ఎలాగైనా బద్దలు కొట్టి తీరుతామని శబదం చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 24 లో హిందూపురం నియోజకవర్గలో టీడీపీ కంచుకోట బద్దలు కొడుతుందా, బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా ఎత్తులు పై ఎత్తులు ఎవరి సాగుతాయో చూడాల్సి ఉంది. హిందూపురం ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న.

ఇది కూడా చదవండి: CM YS Jagan Raksha Bandhan Wishes: అక్క చెల్లెమ్మలకు సీఎం జగన్ శుభాకాంక్షలు

#ycp-vs-tdp-at-hindupur #ycp-vs-tdp #latest-news #andhra-pradesh #hindupur #political-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి