YCP Rebel MLA's : హైకోర్టుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలు..! స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ లు వేశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. పార్టీ మార్పుపై వివరణకు కొంత సమయం కావాలని ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. By Jyoshna Sappogula 29 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి YCP Rebel MLA's : వైసీపీ(YCP) రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు సొంత పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నలుగురిపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద్ రాజు(Prasad Raju) స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నలుగురు రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం(Tammineni Sitaram) నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో స్పీకర్ ముందు హాజరైయ్యరు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు. Also Read: కడప రాజకీయాల్లో సంచలనం.. షర్మిలతో సునీత భేటీ. చేతికి సెలైన్ పెట్టుకుని స్పీకర్ ముందుకు వచ్చారు ఉండవల్లి శ్రీదేవి. అనారోగ్య కారణంగా కొంత సమయం కావాలని స్పీకర్ ను కోరారు. తమ ఎమ్మెల్యే అనర్హత పై వివరణ ఇచ్చుకోవడానికి కొంత సమయం కావాలని నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. అయితే, స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. Also Read: టీమిండియాకు భారీ షాక్.. విశాఖ టెస్టుకు స్టార్ ప్లేయర్ ఔట్! మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC Elections) విప్ ఉల్లంఘించామనటానికి వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలేంటి? సీక్రెట్ ఓటింగ్ లో విప్ ఉల్లంఘించామని ఎలా నిర్ధారించారు? అని ప్రశ్నించారు. అధికారం అండ ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు, రాజీనామా చేయని ఎమ్మెల్యేలు కూడా జగన్ ని విమర్శిస్తున్నారని కామెంట్స్ చేశారు. అన్ని రకాలుగా విమర్శలు ఎదుర్కొనే గొప్ప సీఎం ఇంకెవరైనా ఉంటారా? అని ఎద్దేవ చేశారు. #andhra-pradesh #ycp #ap-politics-2024 #nellore-rural-mla-kotamreddy-sridhar-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి