ఆధారాలు ఉంటే సీఐడీకి అందజేయాలి: విజయసాయి రెడ్డి!

ఏపీలో మద్యం గురించి గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వద్ద ఉన్న ఆధారాలను సీఐడీకి అందజేయాలని తెలిపారు.

ఆధారాలు ఉంటే సీఐడీకి అందజేయాలి: విజయసాయి రెడ్డి!
New Update

వైసీపీ రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పై మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏ-3 గా కేసు నమోదైన లిక్కర్‌ స్కామ్‌ పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి సీఐడీకి అందజేయాలని ఆయన అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలా తప్పుడు సమాచారంతో మా పై నిందలు వేయడం సరికాదన్నారు.

వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలాన్ని ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత కొంత కాలంగా ఏపీ మద్యం అమ్మకాల పై పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని గురించి పురందేశ్వరి చాలా సార్లు ప్రస్తావించారు కూడా.

ఏపీలో ఉగ్రవాదం కన్నా మద్యం ప్రమాదకరంగా మారిందని ఆరోపించారు. సాధారణ ప్రజలపై ప్రభుత్వం మద్యం రూపంలో బాంబులు వేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.నాణ్యతలేని మద్యం తాగడం వల్ల రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఏటా ఏపీలో మద్యం సేవించి ఐదు లక్షల మంది చనిపోతున్నారనేది నిజమని..కానీ దానికంటే ఇంకో లక్ష మంది ఎక్కువే చనిపోతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యల పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు మీద మద్యం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రీవెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద మాజీ సీఎం చంద్రబాబుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీఐడీ. అయితే, ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

also read: చంద్రమోహన్ పై ఆ ఉన్న అపవాదు ఇదే.. డైరెక్టర్ రేలంగి సంచలన విషయాలు!

#purandeswari #bjp #ycp #viajsaireddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe