YCP in Shock : నరసరావుపేట(Narasaraopeta) ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు(Lavu Sri Krishna Devarayalu) వైసీపీ(YCP) కి రాజీనామా చేశారు. దాంతో పాటూ ఎంపీ పదవికి కూడా రాజీనామా(Resign) చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడడం వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. నరసరావు పేటటో బీసీ అభ్యర్ధిని బరిలోకి దించే యోచనలో ఉన్న అధిష్టానం అక్కడ ఎంపీ అయిన రాయలను అదిష్టానం గుంటూరు నుంచి పోటీ చేయాలని అడిగింది. దానికి శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకోలేదు. అమధ్య వైసీపీ అధినేత జగన్ పిలిచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పారు. కొంత మంది వైసీపీ నేతలు కూడా రాయలను మార్చొద్దని జగన్(YS Jagan) కు చెప్పారు. కానీ అధిష్టానం తన నిర్ణయం మార్చుకోలేదు. ఇప్పుడు ఈ కారణంగానే శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పోటీ చేస్తే నరసరావు పేట నుంచే చేస్తానని తేల్చి చెబుతున్నారు. పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీతో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశాను. వారిని వీడి వెళ్ళే ఉద్దేశం లేదని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Breaking : వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు వైసీపీకి రాజీనామా చేశారు. దాంతో పాటూ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడడం వలనే తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు.
Translate this News: