Magunta: వైసీపీకి మరో షాక్..పార్టీని వీడనున్న మాగుంట! వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. By Bhavana 05 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Magunta Srinivasulu Reddy: రాజీనామాకు సిద్దమైన ఒంగోలు ఎంపీ (Ongole MP)మాగుంట శ్రీనివాసులు రెడ్డి. వైసీపీలో మరో ముసలం మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీలోని కొందరు ముఖ్య నేతలు టికెట్లు కన్ఫార్మ్ కాలేదని పార్టీని వీడారు. ఈ నేపథ్యంలోనే తన కుమారుడు మాగుంట రాఘవకి నెల్లూరు ఎంపీ టికెట్ అడిగిన మాగుంట కు కూడా పార్టీ అధినేత నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి మాగుంట మరో రెండు రోజుల్లో కీలక ప్రకటన ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో మాగుంట (Magunta) చర్చలు జరిపారు. ఇప్పటికే తన కుమారుడు మాగుంట రాఘవ టికెట్ విషయం గురించి బాలినేనితో చర్చలు జరిపి విఫలమైన మాగుంట. దీంతో పార్టీని వీడేందుకు సన్నాహలు చేస్తున్నారని సన్నిహితులు పేర్కొంటున్నారు. Also read: Malla Reddy: మల్లారెడ్డి పై కేసు నమోదు..! రానున్న ఎన్నికల్లో టికెట్లు నిరాకరించడంతో పార్టీకి దూరమవుతున్నకీలక నేతలు. ఈ క్రమంలోనే మాగుంట, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఏకాంత చర్చలు జరిపారు. రాజకీయ పరిణామాలు , భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకున్నారు. ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో సిట్టింగ్ లు మార్చే పనిలో జగన్ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల సిట్టింగ్లు మార్చి కొత్త వారికి ఛాన్స్ లు ఇచ్చారు. గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సలహా మేరకు మాగుంటకు ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆ సమయంలో మాగుంట కోసం వైవీ సుబ్బారెడ్డి వెనక్కి వెళ్లారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాగుంట వైసీపీని వీడి మరోసారి సైకిల్ ఎక్కేందుకు సిద్దమైనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ ఇవ్వకపోతే మాత్రం వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో మాగుంట ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించడంతో పార్టీని విడుతున్న కీలక నేతలు. #ycp #tdp #jagan #elections #ap-politics #magunta-srinivasulu #magunta-raghava మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి