Sensational decision of Mylavaram MLA! : ఏపీ రాజకీయాలు(AP Politics) రోజురోజుకి హిట్ ఎక్కుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎవరికీ సీటు ఉంటుంది ఎవరికి ఉండదో అనే సందిగ్ధంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికే సీఎం జగన్(CM Jagan) చాలా చోట్ల పార్టీ ఇన్ ఛార్జ్‌లను మార్చి పడేశారు. దీంతో మంత్రులు,మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయ్యింది.
ఇదిలా కొనసాగుతుండగానే వైసీపీ అధినేతలకు మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఎన్టీఆర్ జిల్లా(NTR District) మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణాప్రసాద్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే వసంతను చాలా సార్లు పార్టీ నేతలతో మాట్లాడించే ప్రయత్నం చేసింది అధిష్టానం. మంగళవారం , బుధవారం కూడా సీఎంవోకి రావాలని వసంత కు సమాచారం పంపింది. కానీ ఆయన హైదరాబాద్ లోనే ఉండిపోయారు. వసంతకు మంత్రి జోగి రమేష్‌కు చాలా కాలం నుంచి వివాదం నడుస్తుంది.
చాలా సార్లు ఈ విషయం పార్టీ అధిష్టానం వరకు వెళ్లింది కూడా. నేతలు బుజ్జగించి పంపడం..మళ్లీ కొద్ది రోజులకు మామూలు కావడంలా అయిపోయింది. ఇప్పుడు ఆయన సడెన్ గా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడం సంచలనంగా మారింది. దీంతో వసంతను బుజ్జగించి సీఎంవోకి రప్పించేందుకు పార్టీ కీలక నేతలు రంగంలోకి దిగారు.
జగన్ పుట్టిన రోజు వేడుకలకు కూడా వసంత దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు సమాచారం. తాను సీఎంవోకి వెళ్లినప్పటికీ తనకు సీటు రాదనే ఉద్దేశంతోనే వసంత సీఎంవోకు వెళ్లడం లేదని స్పష్టం అవుతుంది. లేక మరేదైనా ఉద్దేశం ఉందా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Also read: పల్లవి ప్రశాంత్ సూసైడ్ చేసుకుంటాడేమో: సీపీఐ నారాయణ!