రేవంత్ రెడ్డికి అస్వస్థత అంటూ వార్తలు.. ఖండించిన సీఎంవో
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై సీఎంవో స్పందించింది. సీఎం ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది.