YCP MLA Pendem Dorababu : పిఠాపురం(Pithapuram) వైసిపి ఇంఛార్జిగా వంగా గీతను(Vanga Geetha) వైసీపీ అధిష్టానం(YSRCP) ప్రకటించడంతో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు(MLA Pendem Dorababu) పార్టీ మారుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. నియోజకవర్గంలో ప్రజానీకం మళ్ళీ మరోసారి పోటిచేయ్యాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇదే విషయం సీఎం జగన్ కి(CM Jagan) చెప్పానని.. సర్వే చేసి చెబుతా అని అన్నారని..దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని అన్నారు.
ఇతర పార్టీల నుంచి అఫర్..
ఇతర పార్టీల నుండి ఆఫర్ రావడం వాస్తవమే అని పెండెం దొరబాబు అన్నారు. తనకు టికెట్ ఇస్తారని సీఎం జగన్ పై ఉన్న నమ్మకంతో ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. తనతో ఉన్నవాళ్లే కొందరు తనపై సీఎం జగన్ కు తప్పుడు సంకేతాలు పంపించారని అన్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ వైసిపి పార్టీ కోసం, జగన్ కోసం ప్రజలవద్దకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. తన నియోజవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని.. 2024 తాను బరిలో ఉండాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు.
Also Read : Mindful CEO : కుమారుడి మృతదేహం దగ్గర లేఖ రాసిన పెట్టిన సీఈవో
బలనిరూపణ..
న్యూఇయర్ వేడుకలకు దూరంగా ఉన్నా పెండెం దోరబాబు ఈరోజు బారీ ఎత్తునా తన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇంఛార్జిగా వైసీపీ అధిష్టానం తన పేరు ప్రకటించపోవడంతో 30 వేల మందితో బలనిరూపణ చూపించేందుకు ఏర్పాట్లు చేశారు పెండెం దొరబాబు. పిఠాపురం వైసీపీ ఇంఛార్జిగా వంగా గీతను అదిష్టానం ప్రకటించింది. దీనితో దొరబాబు పార్టీ మారుతారని.. జనసేన లోకి(Janasena) వెళుతున్నారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాకుండా మీటింగ్ లో సీఎం జగన్ ను కలిసిన ఆయన కొత్త ఇంఛార్జీతో కలిసి అన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Also Read : Karimnagar : నేడే పందెం కోడి వేలం.. చరిత్రలో నిలిచిపోనున్న కరీంనగర్