MLA Balaram : లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్

తన వల్లే నేను గెలిచినట్లు ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. లోకేష్‌ను ఎందుకు గెలిపించుకోలేక పోయారని చురకలు అంటించారు వైసీపీ ఎమ్మెల్యే బలరాం. చంద్రబాబు కంటే దుర్మార్గుడు మరొకరు తనకు తెలిసి ఎవరు లేరని అన్నారు.

MLA Balaram : లోకేష్ ఎందుకు గెలవలేదు.. చంద్రబాబుకు ఎమ్మెల్యే బలరాం కౌంటర్
New Update

MLA Balaram : ఇంకొల్లు సభ తాను ఓ దుర్మగుడిని అంటూ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే బలరాం(YCP MLA Balaram). ఆయన మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు తనపై అవాకులు.. చవాకులు పేలడం వెనుక ఎవరూ ఉన్నారో అందరికీ తెలుసాని అన్నారు. స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ ..కావాలని తనపై రాశారని ఫైర్ అయ్యారు. ఒక దుర్మాగ ఆలోచనతో తనపై చంద్రబాబు మాట్లాడని పేర్కొన్నారు.

ALSO READ: కేసీఆర్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?

చంద్రబాబు కంటే..

చంద్రబాబు కంటే దుర్మార్గుడు మరొకరు తనకు తెలిసి ఎవరు లేరని అన్నారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించానని అన్నారు. పదవుల కోసం పాకులాడే తత్వం తనది కాదని తేల్చి చెప్పారు. ఎవరూ ఎలాంటి వారో తేల్చుకుందాం... ఓపెన్ చాలెంజ్(Open Challenge) కి సిద్ధం, చంద్రబాబు నాయుడు ఆఫీస్ అయినా వస్తాను అని ఆన్నారు. తాను గతంలో చీరాల వెళ్తానని ఎప్పుడూ చంద్రబాబును అడగలేదలి క్లారిటీ ఇచ్చారు. పార్టీతో సంబంధం లేకుండా చీరాల ప్రజలు తనకు మంచి మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు.

లోకేష్ ను ఎందుకు గెలిపించలేదు..

తన వల్లనే నేను గెల్చినట్టు చెప్పుకుంటున్న చంద్రబాబు.. లోకేష్ ను ఎందుకు గెలిపించుకోలేక పోయారని చురకలు అంటించారు. 2014 TDP కి వలసలు వచ్చినపుడు పార్టీ కి జరిగే నష్టం అప్పుడే చెప్పినట్లు తెలిపారు. చంద్రబాబు మాట్లాడే ముందూ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. గతంలో TDP లోకి వచ్చినవారు ఇచ్చిన ముడుపులు ఎవరికీ అందాయి? అని నిలదీశారు.

టీడీపీ ఎవరిదో అందరికి తెలుసు..

టీడీపీ పార్టీ ఎవరిదో అందరికి తెలుసు అని అన్నారు. పార్టీ కోసం పనిచేసినవారిని ఏ విధంగా హింస పెట్టారో ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. గతంలో పరిటాల రవి, కోడెల శివప్రసాద్ విషయంలో చంద్రబాబు ఏమీ చేశావ్? అని ప్రశ్నించారు. టీడీపీలోని చాలామందికి తాను దైర్యం చెప్పినట్లు..చంద్రబాబు కాదని అన్నారు. డబ్బు రాజకీయం చేసింది చంద్రబాబు... అందులో ఎన్నో TDP కుటుంబాలు భలయ్యాయని ఆరోపించారు.

Also Read : Bhatti Vikramarka : వారికి వడ్డీ లేని రుణాలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

DO WATCH:

#tdp #chandrababu #ap-elections-2024 #ycp-mla-balaram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe