బాబుకి పవన్‌ కి మతి భ్రమించింది..అందుకే అలా మాట్లాడుతున్నారు!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఎప్పడూ వేడిగానే ఉంటున్నాయి. అధికార పక్షం వారు ప్రతిపక్షం వారు నిత్యం ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటునే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు మీద పంచ్‌ డైలాగులు వేశారు.

New Update

అధికారం రాదు అని తెలిసినప్పటికీ కూడా రెండు పార్టీల వారు అదే ఆశతో బతుకుతున్నారని విమర్శించారు. ఆ విషయం వారి మనసులకు కూడా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి అయ్యేదే లేదని ఆయన పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పార్టీ వారా కాదా అన్న తారతమ్యం లేకుండా సంక్షేమ పథకాలన్నింటిని కూడా ప్రజలందరికీ సమానంగా అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.

ఇప్పటి వరకు 2 లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అమలు చేస్తున్నారని వివరించారు. జనాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే ప్రతి పక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

ఎలక్షన్స్‌ దగ్గర్లో ఉండటంతోనే చంద్రబాబు పవన్‌ పిచ్చి పట్టి ఏం మాట్లాడుతున్నారో కూడా వారికే తెలియకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. వారికి మతి భ్రమించింది అందుకే రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హీట్ నడుస్తుంది. వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది.

ఎలక్షన్స్‌ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు ప్రజల మద్దతు కోసం యాత్రలు చేసి ఆకట్టుకునేందుకు చూస్తున్నారు. యాత్రల సమయంలో వారి మాటలు వింటుంటే అతి త్వరలో ఎన్నికలు ఉన్నాయనిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు