Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ కాపుల కలలను చెరిపేసాడు: తోట త్రిమూర్తులు!

వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.

New Update
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ కాపుల కలలను చెరిపేసాడు: తోట త్రిమూర్తులు!

ఏపీ రాజకీయాలు రోజురోజుకి కొత్త రూపును సంతరించుకుంటున్నాయని చెప్పవచ్చు. జనసేన టీడీపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో అప్పటి నుంచి కూడా రెండు పార్టీల మీద అధికార పక్షమైన వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. జనసేన టీడీపీతో కలవడంతో కాపు నాయకులు పవన్‌ మీద నిప్పులు చెరుగుతున్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఇన్‌ ఛార్జ్ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడారు. పవన్‌ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపివేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులకు భయపడే పవన్‌ సిటింగ్‌ లు మార్పులు చేయడం లేదని పేర్కొన్నారు.

జనసేనకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ములేకనే పొత్తులు కలుపుకున్నారు. వైసీపీకి భయపడింది వారా..? వారికి మేము భయపడుతున్నామా అంటూ ఆయన ప్రశ్నించారు. రెండు పార్టీలు కాదు అన్ని పార్టీలు కలిపి పొత్తులు పెట్టుకున్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం..175 సీట్లు మావే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎన్నో పాదయాత్రలను చూశాం. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన దానిని కూడా పాదయాత్ర అంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో లోకేష్‌ ఎన్ని రోజులు పాదయాత్ర చేశారో వారికైనా తెలుసా లేదా అంటూ ఆయన మండిపడ్డారు.

లోకేష్‌ పాదయాత్ర చేసేది కేవలం సీఎం పదవి కోసం మాత్రమే కానీ..ప్రజల కష్టాలు తీర్చడానికి కాదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. అలాంటి లోకేష్‌ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్‌ రావడం విడ్డూరంగా ఉందని త్రిమూర్తులు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాపు నాయకులంతా పవన్‌ సీఎం కావాలని కోరుకుంటుంటే..పవన్‌ మాత్రం లోకేష్‌ ని సీఎం చేయడానికి కంకణం కట్టుకున్నారంటూ పేర్కొన్నారు.

నేను ఒక కాపు నాయకునిగా అప్పుడు..ఇప్పుడు ..ఎప్పుడు కూడా కాపులకు అండగా ఉంటాను..వారికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు అంటూ త్రిమూర్తులు హెచ్చరించారు. కాపులను బీసీలలో చేరుస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర టీడీపీది అంటూ ఆయన మండిపడ్డారు.

5 శాతం రిజర్వేష్‌ బిల్లు పార్లమెంట్‌ లో స్పష్టత లేకపోవటం వల్లే ఆమోదం కాలేదని ఆయన వివరించారు. నేను మా నియోజక వర్గ ప్రజల శ్రేయస్సు కోసమే పార్టీలు మారాను తప్ప వేరే ఉద్దేశం లేదని ఆయన వివరించారు. ప్రశాంత్‌ కిషోర్‌ టీడీపీతో కలవడం వల్ల వైసీపీకి ఒరిగేది ఏమి లేదని ఆయన స్పష్టం చేశారు.

ఒకప్పుడు బీహార్ గ్యాంగ్‌ అని తిట్టిన చంద్రబాబుకి ఇప్పుడు ఆ బీహార్‌ గ్యాంగే కావాల్సి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. ముద్రగడ పార్టీలోకి వస్తాడా లేదా అనేది ఆయన వ్యక్తిగత ఏదిఏమైనా రాబోయే ఎన్నికల్లో మండపేట ప్రజలు నన్ను గెలిపించటానికి సిద్దంగా ఉన్నారు అంటూ త్రిమూర్తులు ధీమా వ్యక్తం చేశారు.

Also read: న్యూ ఇయర్ లో రామమందిరంతో పాటు ప్రారంభం కానున్న ప్రముఖ ఆలయాలివే!

Advertisment
తాజా కథనాలు