Sajjala: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

సీఎం జగన్ పై షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి. షర్మిలకు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ నే ఆమె చదువుతున్నారని చురకలు అంటించారు. షర్మిలకు సీఎం జగన్ ఏం అన్యాయం చేశాడో చెప్పాలని అన్నారు.

New Update
Sajjala: చంద్రబాబు స్క్రిప్ట్.. షర్మిల వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

Sajjala Ramakrishna Reddy: కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి. షర్మిల ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన లేదని అన్నారు.ఆమె చేసే వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని పేర్కొన్నారు. షర్మిల మాట్లాడిన ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదని అన్నారు.

షర్మిలకు సీఎం జగన్ కానీ వైసీపీ పార్టీ (YCP Party) గాని ఏం అన్యాయం చేసిందో చెప్పాలని ఆమెను కోరారు. వైఎస్ జగన్ (CM YS Jagan) పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని అన్నారు. 16 నెలలు సీఎం జగన్ ను జైళ్లో పెట్టారని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ప్రేమించిన ప్రతి గుండె సీఎం జగన్ ను ప్రేమిస్తుందని అన్నారు. సీఎం జగన్ అప్పట్లో ఓదార్పు యాత్ర చేస్తుస్తుంటే.. ఆ యాత్రను అపాయేలను కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది నిజం కాదా? అని షర్మిలను ప్రశ్నించారు. వైఎస్ కుటుంబాన్ని ఇబ్బందిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా? అని ప్రశ్నించారు.

Also Read: విజయవాడ సెంట్రల్ వైసీపీ లో సమసిన అసంతృప్తి

సీఎం జగన్ పై అక్రమ కేసులను కాంగ్రెస్ పార్టీ పెట్టిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని అన్నారు. అప్పట్లో జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆమె పెట్టిన పార్టీ కోసం పని చేసిన వారికి షర్మిల ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నేతలు షర్మిలను ఎందుకు వద్దు అని అనుకుంటున్నారని ప్రశ్నించారు.

మాదే గెలుపు..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి వరుస సభలు ఉంటాయని తెలిపారు. శనివారం భీమిలిలో సీఎం జగన్‌ తొలి సభ ఉంటుందని పేర్కొన్నారు.

పేద ప్రజల పక్షపాతి..

సీఎం జగన్‌ పేద ప్రజల పక్షపాతి అని అన్నారు సజ్జల. అధికారం అంటే బాధ్యతగా భావించిన నాయకుడు వైఎస్‌ జగన్‌ అని కొనియాడారు. వైఎస్సార్‌సీపీలో అందరూ కార్యకర్తలే అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలవడమే లక్ష్యం.. కుల, మత, రాజకీయాలకు అతీతంగా.. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. అవినీతికి తావులేకుండా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయన్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన నాయకుడు జగన్‌ అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు