Punganuru : బీసీవై నాయకురాలి పై వైసీపీ శ్రేణుల దాడి!

చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ నాయకురాలు అంజమ్మ పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ కి చెందిన చంద్రశేఖర్‌, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనే వ్యక్తులు అంజమ్మ పై వేట కొడవలితో దాడికి దిగారు.

New Update
Punganuru : బీసీవై నాయకురాలి పై వైసీపీ శ్రేణుల దాడి!

AP : చిత్తూరు జిల్లా (Chittoor District) పుంగనూరు మండలం బర్నేపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీసీవై పార్టీ (BCY Party) నాయకురాలు అంజమ్మ పై వైసీపీ (YCP) శ్రేణులు దాడికి దిగాయి. వైసీపీ కి చెందిన చంద్రశేఖర్‌, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ అనే వ్యక్తులు అంజమ్మ పై వేట కొడవలితో దాడికి దిగారు.

అంజమ్మ పై నిందితులు దాడి చేస్తున్న క్రమంలో స్థానికులు, కుటుంబ సభ్యులు అడ్డుపడి అడ్డుకోగా.. నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితురాలు అంజమ్మను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంజమ్మ తలకు, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీఎం

Advertisment
తాజా కథనాలు