AP: జూన్ 19న వైసీపీ విస్తృత స్ధాయి సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ!

జూన్ 19న జగన్ అధ్యక్షతన వైసీపీ విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ మీటింగ్ కు గెలిచిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు, ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ హైకమాండ్ ఆహ్వానించింది.

New Update
AP: జూన్ 19న వైసీపీ విస్తృత స్ధాయి సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ!

YCP Meeting: ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైన వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన్ (YS Jagan) వరుస సమావేశాలతో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగాఏ జూన్ 19న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుండగా.. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలతో పాటు, ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ హైకమాండ్ ఆహ్వానించింది. వీరితో పాటు ఎంపీలు మినహా పార్లమెంట్‌కు పోటీచేసిన అభ్యర్థులను కూడా ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇది కూడా చదవండి: Jammu kashmir: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!

ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో పలువురు నేతలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీతో, ఒకరిద్దరు ఎంపీలు బీజేపీలోకి టచ్‌లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరగబోయే సమావేశంలో పార్టీ జంపింగులు, తదుపరి కార్యచరణకు సంబంధించిన అంశాలపైనే కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు