Andhra Pradesh: కడపలో క్యాంపు రాజకీయాలు..నేతలను కాపాడుకునేందుకు వైసీపీ పాట్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటివరకు బలంగా ఉన్న వైసీపీ పరిస్థితి తల్లకిందులు అయిపోయింది. నేతలు ఒక్కొక్కరే కూటమిలోకి వెళ్ళిపోతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాంపు పాలిటిక్స్‌కు తెర తీసింది. By Manogna alamuru 29 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YCP Party Camp Politics: వైసీపీ పార్టీ కష్టాలను ఎదుర్కోంటోంది. అధికారం లేని చోట ఉండడం కంటే అధికార పార్టీలో చేరిపోవడం బెటర్ అని ఆపార్టీ నేతలు వెళ్ళిపోతున్నారు. కార్పొరేటర్లు మొదలుకొని ఎంపీల వరకు ఇదే చేస్తున్నారు. ఇందులో టీడీపీ పాత్ర కూడా చాలా బలంగానే ఉంది. వైసీపీ ఎంపీల చేత రాజీనామా చేయించి తమ పార్టీలో చేర్చుకోవడంలో విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా 11మంది ఎంపీల్లో పది మంది కూటమి పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని సమాచార. వీరిలో టీడీపీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేన పార్టీలోకి ఇద్దరు వెళ్లబోతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. వీరిద్దరూ త్వరలో తెలుగుదేశం గూటికి చేరబోతున్నారని తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని సిద్ధమవుతున్నారు. ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్. కృష్ణయ్యలు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అలాగే విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలలో ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. దాంతో పాటూ జడ్పీటీసీలు కూడా వైసీపీని వీడి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అది కూడా పాటీ అధినేత సొంత జిల్లా కడప నుంచి అని చెబుతున్నారు. దీంతో జడ్పీటీసీలను కాపాడుకునేందుకు క్యాంపు పాలిటిక్స్ కు వైసీపీ అధిష్టానం తెరలేపింది. రాజంపేట ఎమ్మెల్యే స్వగ్రామమైన అకేపాడులో జడ్పీటీసీల క్యాంపు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అయిదుగురు జడ్పీటీసీలు చేజారిపోయారు. ఎన్నికలకు ముందే వీరు కూటమిలో చేరారు. ఆ తరువాత 49 జడ్పీటీసీల్లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. పులివెందుల జడ్పీటీసీ మృతితో ఒక ఖాళీ అయింది. ఒంటిమిట్ట జడ్పీటీసీ పదవికి ఎమ్మెల్యే అకేపాటి అమర్నాథ్ రెడ్డి..రాజీనామా చేశారు. ఇక 47మందిలో 5గురు చేజారిపోవడం, మరి కొందరు టీడీపీ వైపు చూస్తుండటంతో వైసీపీ అధిష్టానం అలెర్ట్ అయింది. ఇటీవల 42మంది జడ్పీటీసీలతో విజయవాడలో పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. అందులో జడ్పీ చైర్మన్ గా రాంగోవింద రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇక మరోవైపు వైసీపీ జడ్పీటీసీలను టీడీపీ వైపు తిప్పుకునేందుకు నేతల పావులు కదుపుతున్నారు. కొందరు వైసీపీ నేతలు టీడీపీకి టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు పార్టీని వీడి వెళ్ళేందుకు రెడీగా ఉన్నారని సమాచారం. దీంతో అలెర్ట్ అయ్యారు వైసీపీ నేతలు. ఆకేపాడులో క్యాంపుకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జిలకు నియోజకవర్గ పరిధిలోని జడ్పీటీసీలను క్యాంపుకు తరలించే బాధ్యతలను తీసుకున్నారు. మొత్తానికి సొంత పార్టీలో నేతలను కాపాడుకునేందుకు పార్టీ అధినేత జగన్ నడుం బిగించారు. ఇలా ఒక్కొక్కరే పార్టీని వీడి వెళ్ళిపోతే అసలు మొదటికే మోసం వస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. Also Read: Hurun Rich List: ముకేశ్‌ను వెనక్కు నెట్టిన అదానీ.బిలియనీర్ల జాబితాలో 21 ఏళ్ళ కుర్రాడు #ycp #kadapa #jagan #leaders మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి