YSRCP: 7వ జాబితా ప్రకటించిన వైసీపీ..!!

ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది వైసీపీ హైకమాండ్.

New Update
Guntur YCP: గుంటూరులో వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు

YSRCP:  ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జులను మారుస్తున్న విషయం తెలసిందే. ఇప్పటికే పలు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన జగన్..తాజాగా ఏడవ జాబితాను విడుదల చేసింది.

ఏడవ జాబితాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించింది. పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జీగా ఎడం బాలాజీ, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీగా కటారి అరవిందా యాదవ్ లను నియమించింది వైసీపీ హైకమాండ్. మొన్నటి వరకు పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు. గతంలో చీరాల నియోజకవర్గ వైసిపి ఇంచార్జిగా పనిచేసిన ఎడం బాలాజీ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఆమంచి కృష్ణమోహన్ కు చీరాల టికెట్ ఇవ్వడంతో బాలాజీ  టిడిపిలో చేరారు. మళ్లీ ఎన్నికల వేళ వైసిపి గూటిలో వాలారు.

ఇది కూడా చదవండి: పేటీఎంకు కాస్తంత ఊరటనిచ్చిన ఆర్బీఐ…ఆంక్షలపై సడలింపు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు