KCR : సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద వైద్యులు వెల్లడించారు. కేసీఆర్‌ను నిత్యం వైద్యబృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు. కేసీఆర్ బెడ్ మీద నుంచి లేచి నడవగలుగుతున్నారని అన్నారు. ఆర్థోపెడిక్, ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారు కేసీఆర్ ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నామని వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
కేసీఆర్(KCR) ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో కాలు జారి కింద పడటంతో ఆయన ఎడమ తుంటికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో గురువారం అర్ధరాత్రి సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. యశోద ఆసుపత్రిలో వైద్యులు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు. కేసీఆర్ కు సర్జరీ విజయవంతం అయినట్లు వైద్యులు నిన్న (శుక్రవారం) వెల్లడించారు. బాత్ రూంలో జారిపడటంతోనే కేసీఆర్ కు గాయం జరిగినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయిందని తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కేసీఆర్ కోలుకోవడానికి 6-8 వారాలు పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
Also Read : తర్వాత కేసీఆర్ ఎక్సక్లూసివ్ వీడియో