Hero Yash: కేజీఎఫ్‌ హీరో పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి..ముగ్గురు అభిమానులు మృతి!

కేజీఎఫ్‌ హీరో యశ్‌ పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. 20 అడుగుల ఎత్తులో బ్యానర్‌ ఏర్పాటు చేస్తుండగా..కరెంట్‌ షాక్‌ కొట్టడంతో ముగ్గురు అభిమానులు మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Hero Yash: కేజీఎఫ్‌ హీరో పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి..ముగ్గురు అభిమానులు మృతి!

Yash: కన్నడ స్టార్‌ నటుడు , కేజీఎఫ్‌ హీరో యశ్‌ (Yash) పుట్టిన రోజు నేడు. ఆయన అభిమానులు ఆయన పుట్టినరోజు(Birthday)ను ఎంతో ఘనంగా నిర్వహించాలని ఎదురు చూశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం బ్యానర్‌ (Banner) ఏర్పాటు చేస్తుండగా..ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి (Current Shock)గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ విషాదం కర్టాటక (Karnataka) లోని గడగ్ జిల్లాలో జరిగింది. ఈ ఘటన యశ్‌ అభిమానులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతి చెందిన అభిమానులను హనుమంత మజ్జురప్ప హరిజన్‌ (20), మురళీ నీలప్ప నిడివిమని (20), నవీన నీలప్ప గజి (19) అనే యువకులు అక్కడికక్కడే కరెంట్‌ షాక్‌ తో మృతి చెందారు.

Also read: జగన్‌కు మరో బిగ్‌ షాక్‌.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే?

20 అడుగుల ఎత్తులో బ్యానర్‌ ఏర్పాటు చేస్తుండగా పైన ఉన్న విద్యుత్‌ తీగలు ఒక్కసారిగా బ్యానర్‌ ని తాకాయి. బ్యానర్‌ ని పట్టుకుని ఉన్న ఆరుగురు యువకుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు, యువకుల స్నేహితులు అభ్యర్థిస్తున్నారు.

కేజీఎఫ్‌ నటుడు జనవరి 8 న 38 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. తన బర్త్‌ డే నేపథ్యంలో యశ్‌ జనవరి 5 నే తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. '' నా అభిమానులు నా పుట్టిన రోజు కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. నన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు ఆశపడుతుంటారు. నాకు కూడా మీతో కలిసి సమయాన్ని గడపాలని ఉంది. అలా గడపడం నాకెంతో విలువైనది. అయితే జనవరి 8న నేను మీకు అందుబాటులో ఉండడం లేదు. మనం అందరం మరోసారి కలుద్దాం . మీ అందరిని నేరుగా కలవకపోయినా..మీ అందరి శుభాకాంక్షలు నా హృదయానికి చేరతాయి'' అంటూ రాసుకొచ్చారు.

యశ్‌ ముందు అనేక టీవీ సీరియల్స్‌ లో నటించారు. కన్నడలో 2007లో జంబడ హుడుగి అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. కేజీఎఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌‌ అయ్యారు. ప్రస్తుతం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో టాక్సిక్‌ సినిమా చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు