Yarlagadda Venkata Rao joins TDP: నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ.. లోకేష్ తో సమావేశమై పార్టీలో చేరారు. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది.

Yarlagadda Venkatrao: గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావ్
New Update

Yarlagadda Venkata Rao joins TDP in front of Nara Lokesh Contest in Gannavaram:  తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు పసుపు కండువా కప్పుకున్నారు. యార్లగడ్డకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు లోకేష్. నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో యార్లగడ్డ.. లోకేష్ తో సమావేశమై పార్టీలో చేరారు. ఆ తర్వాత యార్లగడ్డ-లోకేష్ మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది.

ఆదివారం చంద్రబాబుతో యార్లగడ్డ భేటీ:

ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు యార్లగడ్డ. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తన సమ్మతి తెలియజేశానని.. కలిసి పనిచేద్దామని చంద్రబాబు చెప్పారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైసీపీకి మద్దతు తెలుపడంతో తనను వైసీపీ నాయకులు పక్కన పెట్టారని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లుగా తాను, తన వర్గం ఎన్నో ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు. వాటన్నింటిపై చంద్రబాబుతో చర్చించానన్నారు. అలాగే గన్నవరం, గుడివాడ ఎక్కడ నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే.. అక్కడ నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ అన్నారు.

రాజకీయాల కోసమే అమెరికా వదిలి ఇక్కడకు వచ్చానన్నారు. తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వనప్పుడు మదన పడ్డానన్నారు. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడే చేస్తానని, గుడివాలో చేయమన్నా చేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో ఉన్నప్పుడు అనేక అంశాలను ప్రస్తావించానని, హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీలో మన ఇష్టా ఇష్టాలతో సంబంధం లేదన్నారు. తనకు వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా ఇష్టమని.. అయితే సజ్జలనే తనపై ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు యార్లగడ్డ వెంకట్రావు.

ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా:

ఈ నెల 18వ తేదీన వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు.

ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో నేను గన్నవరం నియోజకవర్గంలో నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో నీకు ఎదురు పడతానని సీఎం జగన్ కి సవాల్ విసిరారు యార్లగడ్డ వెంకట్రావు.

#nara-lokesh #tdp #gannavaram #yarlagadda-venkata-rao #yuvagalam-padayatra #yarlagadda-venkata-rao-joins-tdp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe