/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Yanamala-Krishnudu-jpg.webp)
Yanamala Krishnudu: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ పై విమర్శలు గుప్పించారు. టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని ఆరోపించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని అన్నారు. టీడీపీలో 42 సంవత్సరాలగా ఉన్నానని భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగిందని అన్నారు.
ALSO READ: వైసీపీ మేనిఫెస్టోపై చంద్రబాబు సెటైర్లు
చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రజలకి సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. తనకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా... ఘోరంగా అవమానించారని అన్నారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరని.. 42 సంవత్సరాలగా ప్రజలమధ్య ఉన్నది నేనే అని వ్యాఖ్యానించారు. అయిదేళ్ల సిఎం వైఎస్ జగన్ పాలన చూసి వైఎస్సార్ సిపిలో చేరినట్లు చెప్పారు. సిఎం వైఎస్ జగన్ ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా అని అన్నారు. కాకినాడ ఎంపిగా చలమలశెట్టి సునీల్.. తునివెమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపుకి కృషి చేస్తానని వెల్లడించారు.