యాదాద్రి కలెక్టరేట్‌లో కత్తిపోట్ల కలకలం.. మహిళా ఉద్యోగి వీరంగం

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మహిళా ఉద్యోగి రెచ్చిపోయింది. తనతో పనిచేసే సహ ఉద్యోగుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మనోజ్ అనే వ్యక్తిని అక్కడున్న సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
యాదాద్రి కలెక్టరేట్‌లో కత్తిపోట్ల కలకలం.. మహిళా ఉద్యోగి వీరంగం

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఓ మహిళా ఉద్యోగి రెచ్చిపోయింది. తనతో పనిచేసే సహ ప్రభుత్వ ఉద్యోగుడిపై కత్తితో దాడి చేసింది. ప్రస్తుతం ఈ కత్తిపోట్ల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. తీవ్రంగా గాయపడిన మనోజ్ అనే ఉద్యోగుడిని అక్కడున్న సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు ఆఫీస్ సిబ్బంది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లాలోని ఆత్మకూరు మండలంలో వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్నాడు మనోజ్‌. అదే కార్యలయంలో మండల వ్యవసాయ అధికారిణి (ఏవో)గా శిల్ప కూడా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఏవో కార్యాలయంలోనే వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో చాలాసేపు వాదించుకున్న ఉద్యోగులు కాసేపటికీ గొడవ పెట్టుకుంటూనే ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఇరువురు కలగజేసుకున్నప్పటికీ శాంతించకపోగా ఇద్దరి మధ్య గొడవ తారస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఏవో శిల్ప తన దగ్గరున్న కత్తితో మనోజ్‌పై దాడి చేసింది. మనోజ్ వీపుపై పలుచోట్ల్ కత్తి గీసుకుపోవడంతోపాటు ఓ చోట పెద్ద గాయమైంది. దీంతో అక్కడున్న సహ ఉద్యోగులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని శిల్పను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడిన మనోజ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also read ;Hyderabad Traffic:హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!

అయితే ఈ దాడికి గల కారణాలు పూర్తిగా తెలియలేదని, కొంతకాలంగా ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నట్లు సన్నిహితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన శిల్ప.. మనోజ్‌పై దాడి చేసి ఉంటుందని, త్వరలోనే ఇందుకుగల పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు