యాదాద్రి కలెక్టరేట్లో కత్తిపోట్ల కలకలం.. మహిళా ఉద్యోగి వీరంగం
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఓ మహిళా ఉద్యోగి రెచ్చిపోయింది. తనతో పనిచేసే సహ ఉద్యోగుడిపై కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మనోజ్ అనే వ్యక్తిని అక్కడున్న సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ట్రీట్ మెంట్ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.