కొద్ది రోజుల క్రితం గంట ఛార్జీంగ్ పెడితే 500 కిలోమీటర్లు నడిచే కారు గురించి విన్నాం. ఇప్పుడు తాజాగా ఒక సింగిల్ ఛార్జీంగ్ తో 800 కిలోమీటర్లు నడిచే కారుని ప్రవేశ పెట్టింది చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ.
తాజాగా బీజింగ్ లో జరిగిన షావోమి ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా కంపెనీ ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎస్ యూ 7 (స్పీడ్ అల్డ్రా 7) . ఇది ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో ఉన్న అత్యుత్తమ అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు మెయిన్ ప్రత్యర్థిగా ఉన్నట్లు సమాచారం.
రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ విభాగంలో మరింత గుర్తింపు పొందడంతో పాటు మార్కెట్లో తమ కార్లు వినియోగమే ముందు ఉండేటట్లు కంపెనీ కృషి చేస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్‌యూ 7 అనేది నాలుగు డోర్లు కలిగిన కారు.
ఇందులో 73.6 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ ఛార్జ్‌తో సుమారు 800 కిలో మీటర్లు కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుంది. ఈ కారు మరో రెండు సంవత్సరాల్లో మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలున్నట్లు కంపెనీ వివరించింది.
కార్లన్ని కూడా బీజింగ్ లోనే తయారవుతున్నట్లు కంపెనీ వివరించింది. చైనా నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీని ధర 200000 యువాన్ ల నుంచి 300000యువాన్ ల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 25 లక్షల నుంచి 35 లక్షల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే భారత్ లో ఎప్పుడు కారు వస్తుందో ఇంకా కంపెనీ వివరించలేదు
Also read: మీరు బతికి ఉన్నారని మీ ఫీలింగ్ మాత్రమే వర్మగారు..నాగబాబు రీ కౌంటర్!