ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సంస్థ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. చాలామంది యూజర్లు, తమ మొబైల్ ఫోన్లలో, ఇతర వెబ్‌సైట్‌లలో ఎక్స్ సేవలను పొందలేకపోతున్నారు. 'పోస్టులు లోడ్ అవ్వడం లేదు', 'మళ్లీ ట్రై చేయండి' అని కనిపించే డిస్‌ప్లేలను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్ వినియోగదారులు సోషల్ మీడియాలో తమ కోపాన్ని చూపిస్తున్నారు. సేవలు అందుకోలేకపోతున్నామని ఎక్స్ సంస్థకు రిపోర్టులు చేస్తున్నారు.
Also read: చైనాలో యాగి తుపాన్ బీభత్సం.. కొట్టుకుపోతున్న మనుషులు
అయితే ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోతున్న సేవలకు సంబంధించి ఎక్స్ ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే సేవలు పునరుద్ధరుస్తామనే ఒక్క స్టేట్‌మెంట్ కూడా చేయలేదు. ఎలాన్ మస్క్ ఎక్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి పలుమార్లు ఇలా ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఎక్స్‌ను విరివిగా వినియోగించే వినియోగదారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలు తరచుగా నిలిచిపోతుంటాయి. అప్పుడు చాలా మంది ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు పోటెత్తుతారు. దీనికి సంబంధించిన మీమ్స్ కూడా వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఎక్స్ సేవలు కూడా నిలిచిపోవడంతో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.