India : భారత్‌లో 2 లక్షల అకౌంట్లపై నిషేధం.. కారణం ఇదే

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ ఫాం 'ఎక్స్‌' నెలరోజుల వ్యవధిలోనే భారత్‌లో ఏకంగా 2,12627 ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. చిన్నారులకు సంబంధించిన అశ్లీలం, నగ్నత్వ కంటెంట్‌ను పోస్టు చేయడంతోనే ఈ చర్యలకు పాల్పడినట్లు పేర్కొంది.

New Update
X Platform: ఎక్స్‌లో పోస్ట్ చేయాలంటే ఫీజు కట్టాల్సిందే..షాకింగ్ డెసిషన్

2 Lakh Accounts Ban : ప్రస్తుతం అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు(Mobile Phones) వచ్చాక సోషల్ మీడియా(Social Media) లోనే కొన్ని గంటల పాటు మునిగిపోతున్నారు. వినోదం, వార్తలు, విద్య ఇలా వీటన్నింటికీ సంబంధించి ఫోన్‌లోనే తెలుసుకుంటున్నారు. మరోవైపు నిత్యం అసత్య ప్రచారాలు, అశ్లీల దృశ్యాలు కూడా సోషల్ మీడియాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నిబంధనలను ఉల్లంఘిస్తున్న వినియోగదారుల అకౌంట్లపై ఎలన్‌ మస్క్‌(Elon Musk) కు చెందిన మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్‌ఫామ్‌ 'ఎక్స్‌' చర్యలు తీసుకుంటోంది.

Also Read: తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త

చిన్నారులకు సంబంధించిన అశ్లీలం, నగ్నత్వ కంటెంట్‌ను పోస్టు చేసే ఖాతాలను బ్యాన్‌ చేసింది. కేవలం నెలరోజుల్లోనే భారత్‌(India) లో ఏకంగా 212,627 ఖాతాలను నిషేధించినట్లు 'ఎక్స్‌'(X) వెల్లడించింది. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరో 1,235 ఖాతాలను కూడా బ్యాన్‌ చేసినట్లు తెలిపింది. పిల్లలపై అశ్లీలం, ఉగ్రవాద కంటెంట్‌ నియంత్రణకు సంబంధించి.. అనేక చర్యలు అమలుచేసిట్లు తమ నెలవారీ రిపోర్టులో ఎక్స్‌ వివరించింది. ఇక భారత్‌లోని యూజర్ల నుంచి 5,158 ఫిర్యాదులు అందాయని.. వాటిలో చాలావాటిని పరిష్కరించినట్లు తెలిపింది.

Also Read: బీజేపీని ఓడించకపోతే జరిగేది అదే.. దీదీ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు