WTC Points Table: విశాఖ మ్యాచ్‌ విక్టరీ.. పాయింట్ల పట్టికలో టీమిండియా దూకుడు!

ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌(WTC) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. భారత్ తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు WTCలో వరుసగా మూడోసారి ఫైనల్ ఆడేందుకు మరింత దగ్గర అవుతుంది.

New Update
WTC Points Table: విశాఖ మ్యాచ్‌ విక్టరీ.. పాయింట్ల పట్టికలో టీమిండియా దూకుడు!

WTC Points Table: భారత్-ఇంగ్లండ్ (India vs England) జట్ల మధ్య ముగిసిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. ఈ గెలుపు తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (Test Championship) పాయింట్ల టేబుల్‌ని ఐసీసీ (ICC) అప్‌డేట్ చేసింది. గత మ్యాచ్‌ ఓటమితో ఐదు స్థానానికి పడిపోయిన భారత్‌ (India).. ఇప్పుడు పుంజుకుంది. భారత జట్టు 52.77 శాతం స్కోర్‌తో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా (Australia) జట్టు 55 శాతం స్కోర్‌తో అగ్రస్థానంలో ఉంది. మూడో మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకోవచ్చు.


ఇంకో మ్యాచ్‌ గెలిస్తే నంబర్-1
ఇంగ్లండ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్‌కు ఏడు మ్యాచ్‌ల్లో 59 పాయింట్లు ఉంటాయి. అంటే 55 శాతం పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా జట్టు రెండోస్థానానికి చేరుకుంటుంది. అటు ఇంగ్లండ్ (England) విషయానికి వస్తే ఈ ఓటమితో ఇంగ్లీష్‌ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ గెలవని ఏకైక జట్టు ఇంగ్లండ్‌ కంటే తక్కువ ర్యాంక్‌లో ఉంది. అదే శ్రీలంక (Sri Lanka).


అదరగొట్టిన టీమిండియా:
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బాజ్‌బాల్‌పై భారత బౌలర్లు సత్తా చాటారు. 'బాజ్‌బాల్' (BazBall) అనేది ఇంగ్లండ్ దూకుడు బ్యాటింగ్ శైలిని సూచిస్తుంది. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో జరగనుంది.

Also Read: సాగరతీరంలో దుమ్మురేపిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై గ్రాండ్‌ విక్టరీ!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు