Paris Olympics 2024 : అదరగొట్టిన రెజ్లర్‌ అమన్‌.. సెమీస్‌కు క్వాలిఫై

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్‌ సహ్రావత్ దూసుకుపోతున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సేమిస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమన్.. 12-0 తేడాతో అల్బేనియా దేశస్థుడైన అబాకరోవ్‌ను ఓడించాడు. గురువారం రాత్రి జరగనున్న పోటీలో అమన్ గెలిస్తే భారత్‌కు రెజ్లింగ్‌లో పతకం రానుంది.

New Update
Paris Olympics 2024 : అదరగొట్టిన రెజ్లర్‌ అమన్‌..  సెమీస్‌కు క్వాలిఫై

Aman Sehrawat : పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో భారత రెజ్లర్ అమన్‌ సహ్రావత్ దూసుకుపోతున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో సేమిస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమన్.. 12-0 తేడాతో అల్బేనియా దేశస్థుడైన అబాకరోవ్‌ను ఓడించాడు. మొదటి రౌండ్‌లో మూడు పాయింట్లు సాధించిన అమన్‌.. రెండో రౌండ్‌లో అదరగొట్టాడు. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధించి సెమీస్‌కు వెళ్లిపోయాడు. గురువారం రాత్రి జరగనున్న సెమీస్‌లో జపాన్‌ (Japan) కు చెందిన హిగూచిని ఓడిస్తే భారత్‌కు రెజ్లింగ్‌లో మరో పతకం రానుంది.

Also Read: దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్.. ఎన్నో స్థానంలో నిలిచిందంటే!

ఇదిలా ఉండాగా.. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో అమన్ 10-0 తేడాతో వాద్లిమిర్‌ (నార్త్‌ మాసిడోనియా)ని ఓడించాడు. మొదటి రౌండ్‌లోనే వాద్లిమిర్‌ను రెండుసార్లు కిందపడగొట్టి నాలుగు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత మరో రెండు పాయింట్లు సాధించాడు. రెండో రౌండ్‌లో కూడా అమన్‌ ప్రత్యర్థిని కిందపడగొట్టి పాయింట్లు సాధించాడు. ఇలా ప్రత్యర్థుల నుంచి ప్రతిఘటనలు ఎదురుకాకుండానే అమన్‌ సులువుగా గెలుస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడు భారత్‌ (India) కు పతకం తీసుకొస్తానే అంచనాలు మిన్నంటాయి.

Also Read: దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో హైదరాబాద్.. ఎన్నో స్థానంలో నిలిచిందంటే!

Advertisment
తాజా కథనాలు