Dairy Milk: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ!

చాక్లెట్ ప్రియులకు షాక్. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి క్యాడ్‌బరీ చాక్లెట్‌ కొనగా అందులో బతికున్న పురుగు కనిపించింది. వెంటనే జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయగా.. ఈ చాక్లెట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ నిర్ధారించింది. వీటిని ఎవరూ తినకూడదని సూచించింది.

Dairy Milk: క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ!
New Update

Cadbury Chocolate: చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. పిల్లలనుంచి మొదలు వృద్ధుల వరకూ లొట్టలేసుకుంటూ తింటారు. జనాల అభిరుచులకు తగ్గట్లుగా మార్కెట్ లోనూ విభిన్న రుచుల్లో చాక్లెట్స్ లభిస్తున్నాయి. ఇందులో క్యాడ్ బరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ తాజాగా క్యాడ్ బరీ ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. బతికున్న పురుగులు ప్యాకింగ్ కవర్లలో చాక్లెట్ తింటూ కనిపించడంతో కస్టమర్ కంగుతిన్నాడు. వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై స్పందించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ కీలక ఉత్తర్వూలు జారీ చేసింది.

బతికున్న పురుగులు..
ఈ మేరకు హైదరాబాద్ అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి క్యాడ్‌బరీ చాక్లెట్‌ కొన్నాడు. తెరిచి చూస్తే అందులో బతికున్న పురుగు కనిపించింది. దీనిపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. వెంనటే ఈ ఘటనపై విచారణ చేపట్టిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లేట్స్ ఆరోగ్యానికి సురక్షితం కాదని నిర్దారించింది. క్యాడ్‌బరీ డైరీమిల్క్ చాక్లెట్స్ తినకూడదని వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అలాగే క్యాడ్‌బరీకి చెందిన అన్ని రకాల చాక్లెట్స్ కాకుండా కేవలం రోస్ట్ ఆల్మండ్, ఫ్రూట్ అండ్ నట్ చాక్లెట్స్ మాత్రమే సురక్షితం కాదని తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ స్పష్టం చేసింది. అమీర్ పేట మెట్రోస్టేషన్ లో కొనుగోలు చేసిన క్యాడ్ బరీ చాక్లెట్ లో పురుగులున్న ఆ శాంపిల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ల్యాబ్ లో విశ్లేషణ చేసిన అధికారులు అందులో వైట్ వార్మ్స్ (తెల్ల పురుగులు) ఉన్నట్లు గుర్తించారు.

#telangana #hyderabad #worms #cadbury-chocolate
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe