World Oral Health Day: దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటే ముఖ సౌందర్యం ఎన్నో రెట్లు పెరుగుతుంది. కొందరికి దంతాలు, చిగుళ్లకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నా పట్టించుకోరు. ప్రపంచ ఓరల్ హెల్త్ డేను ప్రతి ఇయర్ మార్చి 20న ఘటనంగా జరుపుకుంటారు. నోటి పరిశుభ్రత, నోటి ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం ఈ రోజును జరుపుకోవడం ప్రధాన ఉద్దేశ్యం. అలాగే, దీనికి సంబంధించిన సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి మీరు నోటి పరిశుభ్రతను ఎలా నిర్వహించాలో తెలుసుకోండి.
నోటి పరిశుభ్రత కోసం ఇలా చేయండి:
- దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. దంతాలు ఆరోగ్యంగా లేకపోతే మీ చిగుళ్ళు కూడా వాచే ప్రమాదం ఉంటుంది. అప్పుడు రక్తం బయటకు వస్తుంది.
- ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు వస్తుంది.
- మీరు మీ దంతాలు చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఆరు నెలలకు దంత పరీక్ష చేయించుకోవడం అవసరం.
- అవసరం ఉంటే దంత క్షయం చికిత్స చేయించుకోవాలి. లేకపోతే నోటికి సంబంధించిన అనేక ఇతర సమస్యలు ఉండవచ్చు.
- టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌లను మంచి కంపెనీవి వాడండి. అల్ట్రా సాఫ్ట్, సాఫ్ట్ బ్రష్‌లను ప్రిఫర్ చేయండి.
- మీ దంతాలను ఫ్లోస్ చేయడం మర్చిపోవద్దు. పిల్లలు చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. ఇవి పళ్లను పాడుచేస్తాయి.
మంచి టీత్ కోసం:
- దంతాలను బలోపేతం చేయడానికి చేపలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. ఇందులో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇది లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది. దంతాలను శుభ్రపరుస్తుంది. మీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను చేర్చాలి. వీటిలో క్యాల్షియం, విటమిన్ -సి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఏ వయసు పిల్లలకు ఏ పాలు తాగించాలి..?.. నిపుణులు చెబుతున్నదేంటి..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.