వన్డే వరల్డ్‌కప్(2023) ఫైనల్ ఓటమిని అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేదు. చివరి మెట్టుపై బోల్తా పడడం ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా ప్లేయర్లను ఎంతగానో బాధించింది. ఫ్యాన్స్ కంటే ప్లేయర్లే ఎక్కువగా బాధపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టం వాళ్లది.. ప్రయత్నం వాళ్లది.. ఒత్తిడి వాళ్లది.. బాధ,నొప్పి కూడా వారివే! వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి.. ప్రత్యర్థులను చీల్చిచెండాడి.. ఆఖరిలో చిన్న పొరపాటుకు ఓడిపోతే ఆ బాధ ఊహకందనది. ఈ వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్‌లో కోహ్లీ, రోహిత్ తమదైన శైలిలో జట్టును ముందుండి నడిపంచగా.. బౌలింగ్‌లో షమీ, బుమ్రా సత్తా చాటారు. ఇక వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ(Virat Kohli) గ్రౌండ్‌లో ఏ విధంగా బాధపడ్డాడో చూపే ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
స్టంప్స్‌ను పడేశాడు:
వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలవగానే ఆ టీమ్ ప్లేయర్లు గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అదే సమయంలో గ్రౌండ్‌లో ఉన్న టీమిండియా ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. తలపైకి ఎత్తలేకపోయారు. కన్నీళ్లను దాచుకుంటూ నిదానంగా అడుగులు వేశారు. ఈ క్రమంలో స్లోగా నడుచుకుంటూ స్టంప్స్ దగ్గరకు వచ్చిన కోహ్లీ. అక్కడి స్టంప్స్‌ను ఎంతో నిరాశగా కిందపడేశాడు. ఆస్ట్రేలియా టార్గెట్ ఛేజ్ చేసిన వెంటనే భారత ఆటగాళ్లు నిరుత్సాహంగా కనిపించారు. కోహ్లి తన టోపీని తీసేసి, నిరాశతో బెయిల్‌లను తొలగిస్తూ కనిపించాడు. ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. కోహ్లీ రియాక్షన్‌ను చూపిస్తూ ఒక అభిమాని ఇటీవల సోషల్‌మీడియాలో ఈ వీడియోను షేర్ చేసుకున్నాడు.
చేదు జ్ఞాపకాలు:
నవంబర్ 19న జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్ రోహిత్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వేగంగా రన్స్ చేస్తూ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. మరో ఎండ్‌లో గిల్ ఔటైనా రోహిత్ ఫోర్లు, సిక్సులు కొట్టడంతో స్టేడియంలో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మరో ఎండ్‌లో కోహ్లీ కూడా వరుస ఫోర్లలతో అలరించాడు. అర్థసెంచరీ వైపు అడుగులు వేస్తున్న రోహిత్ 47 రన్స్ వద్ద ఔట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో రోహిత్ లాఫ్ట్ చేయగా.. హెడ్ బ్యాక్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి మరి క్యాచ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. ఇక తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అయ్యర్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు పడడంతో కోహ్లీ, తర్వాత వచ్చిన రాహుల్ కూడా డిఫెన్స్‌లో పడిపోయారు. అసలు బౌండరీ కూడా కొట్టలేకపోయారు. దాదాపు 88 బంతులు దాటినా బౌండరీ వెళ్లలేదు. అటు రాహుల్ స్లోగా ఆడినా.. కోహ్లీ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు రాహుల్ స్లోగా ఆడినా.. కోహ్లీ మాత్రం స్ట్రైక్ రొటేట్ చేస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వెంటనే కమ్మిన్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు కోహ్లీ. 63 బంతుల్లో 54 పరుగులు చేసిన కోహ్లీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. మరో ఎండ్‌లో రాహుల్ స్లోగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 109 బంతుల్లో 66 రన్స్ చేసిన రాహుల్ ఔట్ అయ్యాడు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ చెత్తగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్లకు స్టైక్ ఇస్తూ టీమిండియాను దెబ్బకొట్టాడు. చివరకు 50 ఓవర్లలో భారత్ 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
హెడ్.. వారేవ్వా:
241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆదిలో తడపడింది. ముందుగా వార్నర్, మిచెల్ మార్ష్, స్టిమ్ స్మిత్ వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లుబూషేన్‌తో జత కలిసిన హెడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. లుబుషేన్ ఓవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తుండగా.. మరో ఎండ్‌లో హెడ్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్ తర్వాత మరింత ధాటిగా బ్యాటింగ్ చేశాడు. తర్వాత సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 50 పరుగుల లోపే మూడు వికెట్లు పడగొట్టిన టీమిండియా తర్వాత మరో వికెట్ తియ్యడంలో విఫలమైంది. దీంతో ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్‌కప్‌ను ముద్దాడింది.
Also Read: అమ్మ కు ప్రేమతో అంటూ ..గరిటె తిప్పిన రాహుల్ గాంధీ!
WATCH: